Charminar Ganesha : ప్రత్యేక ఆకర్షణగా చార్మినార్ గణేషా
శోభ యాత్రలో చార్మినార్ అట్రాక్షన్
Charminar Ganesha : హైదరాబాద్ – హైదరాబాద్ నగరం శోభయామానంగా మారి పోయింది. లక్షలాది మంది జీవించే ఈ నగరం భారతీయ సంస్కృతికి అద్దం పట్టింది. ప్రతి ఏటా నిర్వహించే గణేశుడి నిమజ్జనం ఈసారి కూడా అంగరంగ వైభవోపేతంగా సాగింది. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభ యాత్ర నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది.
Charminar Ganesha Viral
ఒక్క భాగ్య నగరంలోనే 50 లక్షల వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. గణనాథుల నిమజ్జనం నిన్న ప్రారంభమైంది ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు రెండు రోజులకు పైగా సాగుతుంది ఈ శోభ యాత్ర. సీపీ సీవీ ఆనంద్(CV Anand) నేతృత్వంలో వేలాది మంది పోలీసులు తమ విధులు నిర్వహించారు.
ముస్లింలు , హిందువులు అన్న భేద భావం లేకుండా నగరంలో భారీ ఎత్తున వినాయకులను ఊరేగించారు. ఇదిలా ఉండగా చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం నగరానికే హైలెట్ గా నిలిచింది. ప్రత్యేకంగా హిందూ భక్తులకు ముస్లిం సోదరులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వారికి నీళ్లు, ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ అరుదైన సన్నివేశం యావత్ భారతావనిని కదిలించేలా చేసింది. మానవులంతా ఒక్కటేనని చెప్పిన మహమ్మద్ ప్రవక్త, శ్రీకృష్ణుడిలను మరోసారి గుర్తుకు తెచ్చేలా చేశారు. మొత్తంగా చార్మినార్ వినాయకుడు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారారు.
Also Read : Hyderabad Vinayaka Immersion : జై బోలో గణేశ్ మహరాజ్ కీ