Elon Musk Chat GPT : మస్క్ పై చాట్ జిపిటి కామెంట్స్

ప్ర‌ముఖులంతా వివాదాస్ప‌దులే

Elon Musk Chat GPT : ప్ర‌పంచ టెక్నాల‌జీ రంగంలో కీల‌క మార్పు చోటు చేసుకుంది. ఏఐ చాట్ జిపిటి దెబ్బ‌కు గూగుల్ షేక్ అవుతోంది. ఇందుకు సంబంధించి ఆద‌ర బాద‌ర‌గా విడుద‌ల చేసిన గూగుల్ బార్డ్ తేలి పోయింది. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా చాట్ జిపిటి గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. ఏదైనా మ‌న‌కు కావాల్సిన దానిని అడిగితే క్ష‌ణాల్లో స‌మాధానం ఇస్తుంది. తాజాగా చాట్ జిపిటి ఎలోన్ మ‌స్క్(Elon Musk Chat GPT) ని వివాదాస్ప‌ద‌మైన వ్య‌క్తి అంటూ పేర్కొంది. దీనిపై సెటైరిక్ గా రియాక్ట్ అయ్యారు టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ సిఇఓ ఎలోన్ మ‌స్క్.

ట్విట్టర్ బాస్ ఇటీవ‌ల మైక్రో బ్లాగింగ్ సైట్ లో సోష‌ల్ మీడియా పోస్ట్ పై స్పందించారు. ఎలోన్ మ‌స్క్ ఒక్క‌రే కాదు డొనాల్డ్ ట్రంప్ , కాన్వే వెస్ట్ , ఇత‌ర ప్ర‌ఖ్యాత వ్య‌క్తులు చాట్ జిపిటి ద్వారా వివాదాస్ప‌దంగా ప‌రిగ‌ణించ‌బ‌డ్డారంటూ సూచించింది చాట్ జిపిటి. ఇదిలా ఉండ‌గా ఐసాక్ లాటెరెల్ భాగ‌స్వామ్యం చేసిన పోస్ట్ కి టెస్లా సిఇఓ ప్ర‌తిస్పందించారు.

లాటెరెల్ భాగ‌స్వామ్యం చేసిన జాబితాలో ప‌బ్లిక్ ఫిగ‌ర్స్ వారు వివాదాస్ప‌దంగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌తారో లేదా చూపించారు. ఈ లిస్టులో ప‌లువురు నేత‌లు, ప్ర‌ముఖుల పేర్లు ఉన్నాయి. ఇది ఓపెన్ ఏఐ భాషా న‌మూనా ప‌క్ష‌పాతాన్ని ప్ర‌ద‌ర్శించింది. ర‌ష్యా చీఫ్ పుతిన్ , యుకె మాజీ పీఎం బోరిస్ జాన్స‌న్ , సామాజిక‌వేత్త కిమ్ క‌ర్దాషియాన్ ల‌ను కూడా వివాదాస్ప‌దం చేసింది.

కాగా చాట్ జిపిటి స్పందించ‌న తీరుపై ఎలోన్ మ‌స్క్ విచిత్రంగా స్పందించారు. అదంతా టెక్నాల‌జీ మ‌హిమ‌.

Also Read : తీసుకుంటాం కానీ తొల‌గించం – టీసీఎస్

Leave A Reply

Your Email Id will not be published!