Cherlapally Central Jail: చర్లపల్లి జైలు ఖైదీ కడుపులో తొమ్మిది మేకులు !

చర్లపల్లి జైలు ఖైదీ కడుపులో తొమ్మిది మేకులు !

Cherlapally Central Jail: ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ రిమాండ్‌ ఖైదీని గాంధీ ఆసుపత్రి వైద్యులు కాపాడారు. మెరుగైన వైద్యం అందించి ఖైదీ కడుపులో ఉన్న మేకులను బయటకు తీసారు. ఎండోస్కోపీ ద్వారా తొమ్మిది పొడవాటి మేకులను బయటకు తీసి ఖైదీకు పునర్జన్మ ప్రసాదించారు. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మహ్మద్ షేక్… ఆత్మహత్యలో భాగంగా సెల్ లో ఉన్న మేకులను మింగినట్లు జైలు అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే….

Cherlapally Central Jail Issue..

చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మహ్మద్‌ షేక్‌ (32)కు నాలుగు రోజుల క్రితం హఠాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో జైలు వైద్యుల సిఫార్సు మేరకు అతడిని గాంధీ ఆసుపత్రి ఖైదీల వార్డులో చేర్పించారు. డాక్టర్లు ఎక్స్‌రేలు తీయించి పరిశీలించగా ఖైదీ కడుపులో ఇనుప మేకులు ఉన్నట్లు గుర్తించారు. కడుపులో ఉన్న మేకులను వెంటనే తొలగించకపోతే ప్రాణాపాయం ఉందని నిర్ధారించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు గ్యాస్టో ఎంటరాలజీ విభాగాధిపతి శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలో చికిత్స ప్రారంభించారు. రోగి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి ఎండోస్కోపీ ద్వారా తొమ్మిది మేకులను విజయవంతంగా బయటకు తీశారు. సుమారు 2 -2.5 అంగుళాలు ఉండే ఈ మేకులను రోగి కావాలనే మింగాడని… అందుకు కారణాలేమిటో ఆరా తీస్తున్నామని జైలు వర్గాలు తెలిపాయి.

Also Read : Telangana Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్ ! కామారెడ్డి మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం !

Leave A Reply

Your Email Id will not be published!