Telangana Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్ ! కామారెడ్డి మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం !

బీఆర్ఎస్‌కు మరో షాక్ ! కామారెడ్డి మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం !

Telangana Congress: తెలంగాణలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌ లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే… మరోవైపు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. తాజాగా కామారెడ్డి బీఆర్‌ఎస్ మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. దీనితో ఆమె ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్‌ గా కాంగ్రెస్‌ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవిపై సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేశారు. అవిశ్వాసానికి పరోక్షంగా 9 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సహకరించారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లకు గానూ, కాంగ్రెస్‌కు 27, టీఆర్‌ఎస్‌కు 16, బీజేపీకి ఆరుగురు ఉన్నారు.

Telangana Congress Updates

కాంగ్రెస్ అభ్యర్ధికి బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతు అవిశ్వాస తీర్మానం సమయంలో కోరం సరిపోక పోవడంతో కాంగ్రెస్ కు అనుకూలంగా 9మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఈ 9మంది కౌన్సిలర్లు ప్రత్యేక క్యాంపు నుంచి నేరుగా సమావేశానికి హాజరయ్యారు. బలపరీక్షలో జాహ్నవిని ఓడించడానికి ముందుగానే స్కెచ్ వేయగా… వీరికి బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నేత అండగా నిలిచినట్లు తెలుస్తోంది. అవిశ్వాసానికి అనుకూలంగా 27 మంది చేతులు ఎత్తడంతో తీర్మానం నెగ్గింది. దీనితో కొత్త ఛైర్మన్‌ గా గడ్డం ఇందుప్రియను ఎన్నుకున్నారు. అయితే ఈ అవిశ్వాస తీర్మాణానికి బీజేపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరుకాలేదు. ఇందుప్రియ కామారెడ్డి 8వ వార్డు కౌన్సిలర్‌ గా ఉన్నారు. ఆమె అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ ఛైర్‌పర్సన్‌ పై అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం బయట టపాసులు కాల్చి స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Also Read : Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ‘వివాహ ప్రాప్తి’ రద్దు !

Leave A Reply

Your Email Id will not be published!