Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ‘వివాహ ప్రాప్తి’ రద్దు !

చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ‘వివాహ ప్రాప్తి’ రద్దు !

Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం తలపెట్టిన ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ అర్చకుడు రంగరాజన్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం సందర్భంగా సంతానం లేని మహిళలకు ‘సంతాన ప్రాప్తి’ కోసం గరుడ ప్రసాదం పంపిణీ, ఆదివారం స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా వివాహం ఆలస్యమయ్యే వారికోసం ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమాలు చేపట్టాలని ముందుగా నిర్ణయించామన్నారు.

Chilkur Balaji Temple Rules

శుక్రవారం జరిగిన గరుడ ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇబ్బందులు జరిగాయని… ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించే ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమానికి కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం యథావిధిగా జరుగుతుందని… భక్తులు ఇంటి దగ్గరి నుంచే వివాహ ప్రాప్తికోసం స్వామివారికి మొక్కు కోవాలని సూచించారు. కల్యాణోత్సవానికి ఎవరూ రావద్దని సూచించారు.

Also Read : CM Revanth Reddy : ఆగస్టు 15 లోపు రైతులకు 2లక్షల రుణమాఫీ..వచ్చే ఏడాది పంటకు 500 బోనస్

Leave A Reply

Your Email Id will not be published!