TUDA Chairman : తుడా చైర్మన్ గా మోహిత్ రెడ్డి
- బాధ్యతలు స్వీకరించిన చెవిరెడ్డి
TUDA Chairman : తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ (తుడా) చైర్మన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అత్యంత నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రం జరిగింది. తుడా కార్యాయాలనికి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మి సాదర స్వాగతం పలికారు.
TUDA Chairman Chevireddy Mohith Reddy
అనంతరం చైర్మన్ గా మోహిత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తుడా ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(Chevireddy Mohith Reddy) చురుకైన నాయకుడిగా ఎదిగారు. ఆయన ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు, ప్రభుత్వ విప్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడే ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.
సీఎం పిలుపునిచ్చిన గడప గడప కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో కీలకంగా వ్యవహరించారు మోహిత్ రెడ్డి. ఈ సమయంలో ఉన్నతాధికారులు ఆయన వెంట ఉండడంపై ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఏ హోదాతో పాల్గొంటున్నారని ఆరోపించాయి. దీంతో జగన్ రెడ్డి కేబినెట్ హోదా కలిగిన తుడా చైర్మన్ అప్పగించారు.
Also Read : Peddireddy Ramachandra Reddy : బాబుపై పెద్దిరెడ్డి గుస్సా