Chhattisgarh: టెన్త్‌ లో స్టేట్‌ టాపర్‌ ! కట్ చేస్తే బ్లడ్‌క్యాన్సర్‌ తో చావుబ్రతుకుల మధ్య విద్యార్థిని !

టెన్త్‌ లో స్టేట్‌ టాపర్‌ ! కట్ చేస్తే బ్లడ్‌క్యాన్సర్‌ తో చావుబ్రతుకుల మధ్య విద్యార్థిని !

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌ లో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన ఇషికా బాలా అనే విద్యార్థిని తీవ్రమైన బ్లడ్‌ క్యాన్సర్‌(Blood Cancer) తో బాధపడుతోంది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా చదువులో ఆమె ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఇషిక చికిత్స కోసం ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు. కాంకేర్‌ జిల్లాకు చెందిన ఇషికా బ్లడ్‌ క్యాన్సర్‌తో ఒక ఏడాదిపాటు చదువుకు దూరమైంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మళ్లీ చదువు మొదలుపెట్టి… ఇటీవల నిర్వహించిన ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) సెకండరీ బోర్డు పరీక్షల్లో 99.17 శాతం మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌ గా నిలిచింది. ఐఏఎస్‌ కావాలన్నది తన కలగా ఈ చదువుల తల్లి చెబుతోంది. అయితే ఆమె ఇప్పుడు ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది.

సామాన్య రైతు అయిన ఇషిక తండ్రి శంకర్‌ ఆమె చికిత్స కోసం ఇప్పటికే రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశారు. కుమార్తె స్టేట్ టాపర్ గా నిలిచిందన్న ఆనందం ఒకప్రక్క… కళ్లెదుటే స్టేట్ టాపర్ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుందని మరోప్రక్క ఆయన మధనపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లేదా దాతల సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రధానమంత్రి స్వాస్థ్య సహాయత యోజన కింద ఇషిక ఆరోగ్యం మెరుగుపడటానికి అవసరమైన సహాయం అందేలా చూస్తామని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్‌ కుమార్‌ పటేల్‌ తెలిపారు.

Chhattisgarh – ఏడుగురు టీచర్లకు ఒక్కడే విద్యార్థి అయినా టెన్త్‌ ఫెయిల్‌

ప్రభుత్వ పాఠశాలల దుర్గతిని చాటుతున్న ఉదంతమిది. ఉత్తరాఖండ్‌ లోని నైనీతాల్‌ జిల్లా భద్రకోట్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతికి ఒకే ఒక్క విద్యార్థి ఉన్నాడు. అతడికి అన్ని సబ్జెక్టులు బోధించడానికి ఏడుగురు ఉపాధ్యాయలు ఉన్నారు. అయినా ఆ ఒక్కగానొక్క విద్యార్థి ఇటీవలి పరీక్షల్లో ఫెయిలయ్యాడు. ఈ పాఠశాల చాలా మారుమూల ప్రాంతంలో ఉంది. దాదాపు 5 – 7 కిలోమీటర్ల పరిధిలో ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు కేవలం ఏడుగురు విద్యార్థులు చదువుతున్నారు. కొత్త విద్యాసంవత్సరంలో పదో తరగతికి ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఫెయిలైన విద్యార్థి కూడా వీరికి జత కలిసి మళ్లీ చదువుతున్నాడు. సమీప గ్రామాల నుంచి అయిదో తరగతి పాసైన పిల్లలను పాఠశాలకు తీసుకురావాలని, విద్యాప్రమాణాలు పెంచాలని భద్రకోట్‌ ఉపాధ్యాయులకు కఠినమైన హెచ్చరికలు జారీ చేశామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Also Read : Pakistan: గంటల్లోనే పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ! భారత్, పాక్‌ సరిహాద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తత !

Leave A Reply

Your Email Id will not be published!