China: భారత్-పాకిస్తాన్ వార్‌ పై చైనా షాకింగ్ రియాక్షన్

భారత్-పాకిస్తాన్ వార్‌ పై చైనా షాకింగ్ రియాక్షన్

China : పహాల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య ప్రారంభమైన ఉద్రిక్తతలు… ఆపరేషన్ సిందూర్ తో తారా స్థాయికి చేరాయి. భారత్ ఎంత బుద్ధి చెప్పినా, తీవ్ర నష్టం కలిగించినా పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. వందలాది మంది ఉగ్రవాదులను కోల్పోయి… వరుస దాడులతో పౌరులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పటికీ… సరిహద్దుల దగ్గర దాయాది పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు దిగుతోంది. అయితే భారత సైనికులు కూడా ఏ మాత్రం తగ్గకుండా వారికి గట్టి సమాధానం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్(Bharat)-పాక్ వార్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది చైనా. ఇంతకీ డ్రాగన్ కంట్రీ ఏమందంటే..

China Shocking Comments on Bharat, Pakistan War

భారత్-పాకిస్థాన్ యుద్ధంపై చైనా(China) మొదటిసారిగా స్పందించి. దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండో-పాక్ మధ్య నెలకొన్న పరిణామాలు తమను టెన్షన్ పెడుతున్నాయని తెలిపారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా చైనా వ్యతిరేకిస్తుందని లిన్ జియాన్ స్పష్టం చేశారు. పొరుగు దేశాలైన భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ చట్టాలను పాటించాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు కృషి చేయాలని కోరారు. సిచ్యువేషన్‌ను మరింత క్లిష్టతరం కాకుండా చూడాలని, సంయమనం పాటించాలని చైనా ప్రతినిధి సూచించారు. ఇండో-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రపంచ దేశాలతో కలసి క్రియాశీలక పాత్ర పోషించడానికి తాము రెడీగా ఉన్నామని లిన్ జియాన్ పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా… భారత్-పాకిస్థాన్ వార్ మీద చైనాతో పాటు ఇతర దేశాలు కూడా స్పందిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఘర్షణలు కంప్లీట్‌ గా ఆగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇది కుక్కకాటుకు చెప్పుదెబ్బలా ఉందన్నారు. దీనితో తొలుత టెర్రరిస్టులు అటాక్ చేశారు కాబట్టే ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ ప్రతిదాడి చేసిందని ట్రంప్ పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. ఘర్షణలకు తెరదించేందుకు తమ వంతుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరు దేశాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని… సాయం చేయాల్సి వస్తే తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని యూఎస్ అధినేత పేర్కొన్నారు.

Also Read : Operation Sindoor: 36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు – భారత్‌

Leave A Reply

Your Email Id will not be published!