China Spy Ship : శ్రీలంక ఓడ రేవుకు చేరుకున్న చైనా నిఘా నౌక
భారత్ అభ్యంతరం చేసినా బేఖాతర్
China Spy Ship : భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. దేశం స్వాతంత్ర ఉత్సవాలలో మునిగి పోయింది. కానీ చైనా మాత్రం తాను అనుకున్నదే చేస్తోంది. ఇండియాపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో గిల్లికజ్జాలకు దిగుతోంది.
భారత్ కు చెక్ పెట్టేందుకు శ్రీలంకను ఆయుధాంగా వాడుకుంటోంది. ఇప్పటికే ద్వీప దేశం తీవ్ర అప్పుల్లో కూరుకు పోయింది. చెల్లించలేని స్థితిలో ఉంది.
దీనిని ఆసరాగా చేసుకుని చైనా పట్టు బిగించింది. అప్పులు చెల్లించమంటూ ఒత్తిళ్లకు దిగుతోంది. ఈ తరుణంలో భారత్ పై మరింత నిఘా పెంచేందుకు ఏకంగా తన దేశానికి చెందిన స్పై (నిఘా లేదా గూఢచారి) నౌకను(China Spy Ship) శ్రీలంకకు పంపించింది.
దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతర పెట్టింది. ఈ మేరకు శ్రీలంకకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు చైనా పంతం నెగ్గింది.
శ్రీలంక తల వంచింది. భారత్ అభ్యంతరాలను బేఖాతర్ చేసింది. నిఘా నౌక ఎంచక్కా ఓడ రేవు వద్ద ఎంట్రీ ఇచ్చింది.
చైనా నౌకకు చెందిన ట్రాకింగ్ సిస్టమ్ లు భారతీయ ఇన్ స్టా లేన్ లను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉందంటూ భారత్ ఆందోళన చెందుతోంది.
మంగళవారం ఉదయం శ్రీలంకలోని హంబన్ టోటా ఓడ రేవులో కొలువు తీరింది. ఉపగ్రహాలు, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది చైనా గూఢచారి నౌక యువాన్ వాంగ్ 5.
కాగా ఎలాంటి నిఘా కార్యక్రమాలు చేపట్ట కూడదనే షరతు మీద చైనా నౌకకు పర్మిషన్ ఇచ్చినట్లు శ్రీలంక భారత్ కు వివరణ ఇచ్చింది.
Also Read : సల్మాన్ రష్డీ దాడితో సంబంధం లేదు – ఇరాన్