Rishi Sunak China : చైనాలో స్వర్ణ యుగం ముగిసింది – సునక్
బ్రిటన్ ప్రధానమంత్రి షాకింగ్ కామెంట్స్
Rishi Sunak China : బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చైనాపై. గతంలో చైనాలో స్వర్ణ యుగం అనేది ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. ప్రపంచం చిన్నదై పోయింది. టెక్నాలజీ మారుతోంది. ఇందులో ఆయా దేశాల ప్రాధాన్యతలు కూడా మారి పోతున్నాయని చెప్పారు.
తాము ప్రతి దేశంతో సత్ సంబంధాలను నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తామన్నారు రిషి సునక్(Rishi Sunak). గత నెలలో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.
భారత్ , అమెరికా, ఫ్రాన్స్, చైనా, తదితర దేశాధినేతలు, ప్రధానులతో భేటీ అయ్యారు. వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించి సంతకాలు చేశారు. అంతకు ముందు రిషి సునక్ రష్యా దాడిని ఖండించారు. బేషరతుగా యుద్దాన్ని విరమించాలని కోరారు. ఆపై తానే స్వయంగా ఉక్రెయిన్ ను సందర్శించారు. దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం అయ్యారు.
బ్రిటన్ నుంచి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రష్యా, చైనా తప్పా అన్ని దేశాలు ప్రశంసించాయి. తాను కానీ ఇతర దేశాలు కానీ యుద్దం చేయాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో చైనాతో కూడా సత్ సంబంధాలు కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు రిషి సునక్(Rishi Sunak) .
ప్రపంచ వ్యవహారాల్లో చైనా ప్రాముఖ్యతను విస్మరించదన్నారు. వాణిజ్యం, సామాజిక, రాజకీయ సంస్కరణలకు దారి తీస్తుందనే అమాయక ఆలోచనతో పాటుగా స్వర్ణ యుగం అని పిలవబడే కాలం ముగిసిందని అన్నారు ప్రధానమంత్రి.
Also Read : టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ కన్నుమూత