#ChinnaJeeyar : సన్యాసం ఓ యోగం అదో జీవన వికాసం
దైవం పట్ల ఎరుక లేక పోవడమే సకల సమస్యలకు మూలం
Chinna Jeeyar : మనిషిగా సులభంగా బతికేయొచ్చు. ఒకప్పుడు బతకడమే గొప్ప. కానీ ఇప్పుడు లైఫ్ ను ఎలాగైనా ఎంజాయ్ చెయ్యొచ్చు . ఇలాంటి అవకాశం ఇప్పుడు దొరుకుతోంది. ఇప్పుడున్నన్ని వెసులుబాట్లు ..వనరులు అప్పుడు లేవు . అందుకే ప్రతి ఒక్కరు విలువలను వదిలేశారు . బాంధవ్యాల గూర్చి ఆలోచించడం మానేశారు . అంతా రొటీన్. చదివామా ..అమెరికా చెక్కేశామా ..డాలర్లు కొల్లగొట్టామా ఇదీ నేటి యువత ఆలోచన విధానం.
పక్కన ఎవరున్నారో తెలీదు . మన గతం అక్కర్లేదు . మన తాతముత్తాతలు ఎవరో తెలియదు . అంతా ఒకే జపం .పవర్ కావాలి..పర్సు నిండాలి . మస్తుగా మజా చేయాలి . తాగాలి ..పడుకోవాలి ..వీలైతే చచ్చిపోవాలి . ఇదీ మన జమానా.
భాద్యతలు లేవు . చిన్నిపాటి సమస్యలు ఎదురైతే తల్లడిల్లిపోయే యువతీ యువకులు. వీళ్ళ కోసం కన్నవారి కలలు కల్లలు అవుతున్నాయి . అయితే ఐఐటి లేదంటే ఐఏఎస్ వీళ్ళ గోల్స్ ..పొద్దస్తమానం క్రికెట్ ..మట్కా ..బెట్టింగ్ ..పబ్స్ ..మర్డర్స్ ..ఒక్కటేమిటి సవా లక్ష అవలక్షణాలతో బంగారు జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. వందేళ్లు బతకాల్సిన వాళ్ళు పట్టుమని పదేళ్ల లోపే చావుకు లోనవుతున్నారు .
మనం ఏం నేర్పుతున్నామో తెలీదు . ఎలా ఉండాలో చెప్పలేని దౌర్భాగ్య స్థితికి వచ్చేసాం . ఇలాంటి సమాజాన్నా స్వామి వివేకానంద కోరుకున్నది . ఇలాంటి వ్యవస్ధనా రామానుజుడు ఆశించింది. కానే కాదు . ఉక్కు సంకల్పం ..దృఢమైన పట్టుదల . మొక్కవోని గమ్యం ..కోసం పాటు పడే మనుషులు కావాలని కోరుకున్నారు .
రుగ్మతలతో నిండిన ఆధునిక సమాజానికి చికిత్స చేసేందుకు ఆచార్య్లులు , స్వామీజీలు నడుం బిగించారు . వారిలో చినజీయర్ స్వామిజీ ముందున్నారు . మనుషుల్లో , యువతలో విలువలు పాటించేలా ..వాటిని అనుసరించేలా ప్రయత్నం చేస్తున్నారు . ప్రవచనాల ద్వారా , యజ్ఞయాగాల ద్వారా తన వంతు పాత్ర పోషిస్తున్నారు .
దైవం పట్ల ఎరుక లేక పోవడమే సకల సమస్యలకు మూలం అంటారు . ఈ అందమైన లోకంలోకి వచ్చిన ప్రతి ప్రాణికి ..జీవికి బతికే హక్కు ఉంది . అలా అని ఆ స్వేచ్ఛను హరించే ప్రయత్నం మానుకోవాలి. అన్ని జంతువులు ..పక్షులు కదలగలవు ..పరుగులు తీయగలవు ..కానీ మాట్లాడలేవు . ఒక్క మానవ జన్మకు తప్పా. వీళ్ళు ఆలోచించ గలరు . తాము అనుకున్నది సాధించగలరు .
నేటి సమాజంలో సన్యాసం అన్నది ఫ్యాషన్ అయి పోయింది . కాషాయం అన్నది కామన్ గా మారింది . వీటిని ధరించాలంటే నియమ నిబంధనలు ఉన్నాయి . మనసు , శరీరం ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా సాధన చేయాలి . అన్నిటిని నియంత్రించే ఆత్మను పరిశుద్ధం చేసుకోవాలి . అప్పుడే మన ప్రయాణం ఏమిటో తెలుస్తుంది . సన్యాసం అన్నది ఓ పాఠం . ఓ యోగం . అదో అంతులేని బంధం . సన్యాసం అంటే సమాజాన్ని వదిలేయడం కాదు . తనను తాను తెలుసు కోవడం . తానే దివ్వెగా మారి వేలాది మందికి వెలుగులు పంచడం.
భాద్యత లేకుండా బలాదూర్ గా తిరిగే వాళ్ళు . జడుసుకునే వాళ్ళు ..పిరికి వాళ్ళు ..వాళ్లంతా సన్నాసులు . వీళ్ళ వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండదు . సన్యాసుల వల్ల సమాజానికి ఎంతో ఉపయోగం కలుగుతుంది . ధర్మాన్ని ఆచరించేలా ..నీతి నియమాలు పాటించేలా ..తోటి వారి పట్ల ప్రేమను పంచేలా ..సాటి వారి పట్ల దయ కలిగేలా చేస్తారు . వాళ్ళు సమాజ పరిరక్షణ కోసం నారాయణులు.
అన్నీ తెలిసినా ఏమీ తెలియకుండానే సేవలో భాగస్వాములయ్యే వ్యక్తులు. వేదాలు ..పురాణాలూ ..గీతోపదేశాలు ..అన్నీ ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి . అవి ఈ దేశాన్ని ప్రభావితం చేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు దిశా నిర్దేశనం చేసే స్థాయికి చేరుకున్నాయి .
మనం గెలుపు తీరాలను చేరుకోవాలంటే ..విజయపు దరహాసం వెళ్లి విరియాలంటే భిన్నంగా అడుగులు వేయాలి . అనుకున్నది మన దారికి చేరుకోవాలంటే ..అన్నిటిని అందరిని వదిలేసేందుకు సిద్దమై ఉండాలి . అప్పుడే గెలుపు మనదవుతుంది . విజయం మన ముంగిట నిలబడుతుంది . ఈ స్ఫూర్తి పాఠం నిజం కావాలంటే మనం సన్యాసులమైతేనే సాధ్యమవుతుంది . కాదనగలిగే దమ్ము ఎవరికైనా వుంటే చెప్పండి .

No comment allowed please