Chinna Jeeyar Swamy KCR : సీతారామ ఆలయ పునః ప్రతిష్ఠ
చిన జీయర్ స్వామీ..కేసీఆర్
Chinna Jeeyar Swamy KCR : నిన్నటి దాకా ఎడ మొహం పెడ మొహంగా ఉంటూ వచ్చిన జగద్గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీ..సీఎం కేసీఆర్ మధ్య మళ్లీ సయోధ్య కుదిరిందా. అవుననే అనిపిస్తోంది. రామానుజ ఉత్సవాలలో దూరంగా ఉన్నారు సీఎం.
Chinna Jeeyar Swamy KCR Meet
బీజేపీకి దగ్గరయ్యారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారు. మరో వైపు కేసీఆర్ కుటుంబం ,మంత్రులు సైతం ఉత్సవాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా కీలక ప్రకటన చేశారు. జనగాం జిల్లా లోని వల్మీడి శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయం అత్యంత ప్రసిద్ది చెందింది.
దానిని పునః ప్రతిష్టాపన చేయాలని భావించారు. ఈ మేరకు కేసీఆర్ పునః ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామితో(Chinna Jeeyar Swamy) పాటు సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్య వతి రాథోడ్, రాష్ట్ర సాంస్కృతిక, ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ హాజరు కానున్నారు.
సెప్టెంబర్ 4న వల్మిడి శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయ పునః ప్రతిష్టాపన చేయనున్నారు.
Also Read : CM KCR : కేసీఆర్ కు రాఖీ కట్టిన చెల్లెళ్లు