Chittoor SP: జగన్ బంగారుపాళ్యం పర్యటనకు 500 మందికే అనుమతి – చిత్తూరు ఎస్పీ
జగన్ బంగారుపాళ్యం పర్యటనకు 500 మందికే అనుమతి - చిత్తూరు ఎస్పీ
Chittoor SP : మామిడి రైతులతో మాట్లాడేందుకు మాజీ సీఎం జగన్ బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ… కేవలం 500 మంది మాత్రమే జగన్ (YS Jagan) తో ముఖాముఖీలో పాల్గొనాలని ఎస్పీ మణికంఠ (Chittoor SP) తెలిపారు. జగన్ పర్యటన నేపథ్యంలో మామిడి మార్కెట్ ను ఆయన పరిశీలించారు. ఇది కేవలం రైతులతో ముఖాముఖీ కార్యక్రమం మాత్రమే. రైతుల పరిచయ కార్యక్రమానికి 500 మందిని, హెలిపాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతిస్తున్నాం. ఈ పరిధి దాటితే నిర్వాహకులు ఎవరు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Chittoor SP Comments
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ‘‘రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ వెళ్తున్నట్లు వైసీపీ నేతలు అనుమతి కోరారు. గత పర్యటనల్లో జరిగిన ఘటనల దృష్ట్యా… పర్యటనకు షరతులు విధించాం. మాజీ సీఎం సహా 500 మందికే అవకాశం ఇచ్చాం. ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి లేదు. జనసమీకరణకు ప్రయత్నించిన 370 మందికి నోటీసులు ఇచ్చాం. బైకులు, ఆటోల ద్వారా ప్రజలను రప్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. షరతులు ఉల్లంఘిస్తే రౌడీషీట్లు తెరుస్తాం’’అని ఎస్పీ మణికంఠ తెలిపారు.
పరామర్శల పేరిట అరాచకం సృష్టించాలని జగన్ ప్రయత్నాలు – మంత్రి పార్థసారథి
పరామర్శల పేరిట వైఎస్ జగన్ (YS Jagan) అరాచకం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కాకినాడ జిల్లా తునిలో ఇంటింటికీ టీడీపీ, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే అంశంపై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం పట్టణంలోని తారకరామనగర్‌లో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. విద్యుత్తు, కాలువలు, ఉచిత గ్యాస్‌కి సంబంధించి పలు సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చేసిన తప్పులు, పాపాలు, దోపిడీలు మనసులో ఉన్నాయి కాబట్టే రెడ్ బుక్ పేరు చెబితే వైకాపా నాయకులు బయపడుతున్నారన్నారు.
Also Read : Minister Payyavula Keshav: ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు – మంత్రి పయ్యావుల
