Agnipath Scheme: మాజీ అగ్నివీర్‌లకు కేంద్ర బలగాల్లో 10% రిజర్వేషన్‌ !

మాజీ అగ్నివీర్‌లకు కేంద్ర బలగాల్లో 10% రిజర్వేషన్‌ !

Agnipath Scheme: కేంద్ర బలగాల్లో నియామకాలకు సంబంధించి సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, బీఎస్‌ఎఫ్‌ కీలక నిర్ణయం తీసుకున్నాయి. భవిష్యత్తులో చేపట్టే కానిస్టేబుల్‌ నియామకాల్లో 10శాతం మాజీ అగ్నివీరులకు రిజర్వ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర హోంశాఖ గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపాయి. అగ్నిపథ్‌ పథకం చర్చనీయాంశమైన నేపథ్యంలో బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ అధిపతులు ఈ ప్రకటన చేయడం గమనార్హం.

Agnipath Scheme Update

‘‘మాజీ అగ్నివీరులకు సంబంధించి కేంద్ర హోంశాఖ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం సీఐఎస్‌ఎఫ్‌ కూడా మాజీ అగ్నివీరులను నియమించుకునేందుకు సిద్ధమవుతోంది’’ అని సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ నైనా సింగ్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే కానిస్టేబుల్‌ నియామకాల్లో 10శాతం వారికి కేటాయిస్తామన్నారు. అంతేకాకుండా శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ వీరికి మినహాయింపు ఉంటుందన్నారు. తొలి ఏడాది ఐదు సంవత్సరాలు, తదనంతరం మూడు సంవత్సరాల సడలింపు ఇస్తామన్నారు.

Also Read : NEET 2024: నీట్ పేపర్ లీక్‌ కేసులో మరో నిందితుడి అరెస్ట్ !

Leave A Reply

Your Email Id will not be published!