CJI Chandrachud : ప్రత్యక్ష ప్రసారంపై సీజేఐ కామెంట్స్
స్వలింగ వివాహ చట్టబద్దతపై విచారణ
CJI Chandrachud : దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న స్వలింగ సంపర్కుల వివాహానికి చట్ట పరమైన ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం ఎనిమిదో రోజు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్(CJI Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. స్వలింగ వివాహ ప్రక్రియల కేసుకు సంబంధించి విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడం విస్తు పోయేలా చేసిందన్నారు.
తమ విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల న్యాయ స్థానం సాధారణ పౌరుల ఇళ్లు, హృదయాల్లోకి వెళ్లిందని , లైవ్ స్ట్రీమ్ కంటెంట్ ఇంగ్లీషు కాకుండా ఇతర భాషల్లో ఏక కాలంలో అందుబాటులో ఉండేలా సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సుప్రీంకోర్టు ఇవాళ పేర్కొంది.
మధ్య ప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదించారు. విచారణలో ముఖ్యమైన పతనం ఏమిటంటే సమాజంలో గందరగోళం నెలకొందని , ఈ చర్చ , దేశంలోని వివిధ మూలాల్లో ప్రత్యక్ష ప్రసారం కారణంగా ఈ సమస్య గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. కోర్టులో వాదనలు ఇంగ్లీషులో జరగడమే ఏకైక అడ్డంకి అని గ్రామాల్లో నివసించే చాలా మందికి ఈ భాష అర్థం కాదని ద్వివేది తెలిపారు.
Also Read : ‘స్పందన’ శూన్యం ఎవరికి ఉపయోగం
