CJI Chandrachud : డిక్టేట్ చేస్తానంటే ఊరుకోను – సీజేఐ
కేంద్రంపై మండిపడ్డ చంద్రచూడ్
CJI Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయూమర్తి ధనంజయ వై చంద్రచూడ్(CJI Chandrachud) నిప్పులు చెరిగారు. మంగళవారం కోర్టులో స్వలింగ వివాహాల చట్టబద్దతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సీజేఐ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అంతకు ముందు తీవ్ర వాదోపవాదాలు సాగాయి.
ఈ సందర్భంగా కేంద్రం ప్రొసీడింగ్స్ ను డిక్టేక్ చేయాలని అనుకుంటే తాను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు చంద్రచూడ్. కేంద్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది చాలా సున్నితమై న అంశమని పేర్కొన్నారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే ముందు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయాలని కోరారు. ఈ కోర్టులో విచారణలు ఎలా జరుగుతాయో తనకు ఎవరూ చెప్పలేరంటూ పేర్కొన్నారు సీజేఐ(CJI Chandrachud).
ప్రత్యేక వివాహ చట్టంతో సహా జీవ సంబంధమైన పురుషుడు, స్త్రీ మధ్య మాత్రమే వివాహం జరగాలని శాసనంలో ఉందని చెప్పారు సీజీ. ఈ సందర్భంగా సీజేఐ జోక్యం చేసుకున్నారు.
పురుషుడు లేదా స్త్రీ అనే సంపూర్ణ భావన అస్సలు లేదు. మీ జననాంగాలు ఏమిటో నిర్వచించ లేమని పేర్కొన్నారు. ఇది చాలా క్లిష్టంగా ఉంటుందన్నారు.
Also Read : లింగాయత్ లను పట్టించుకోని బీజేపీ