Same Sex Marriage CJI : కేంద్రం వద్ద సరైన డేటా లేదు
సీజేఐ ధనంజయ వై చంద్రచూడ్
Same Sex Marriage CJI : దేశ వ్యాప్తంగా ఇప్పుడు భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం స్వలింగ సంపర్క వివాహానికి(Same Sex Marriage) సంబంధించి తమకు చట్టబద్దమైన ఆమోదం కావాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరుపుతోంది. సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి.
మోదీ ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోవడం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. హిందూ మతం, ఇస్లాం మతం లో ఇలాంటి అంశానికి ప్రాధాన్యత లేదని పేర్కొంది. ఒక రకంగా కోర్టుకు అంతర్గతంగా ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సీజేఐ(CJI) చేసిన వ్యాఖ్యలు కేంద్రానికి తలనొప్పిగా మారాయి. అర్బన్ ఎలిటిస్ట్ వాదనకు ఎలాంటి డేటా లేదన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఏమైనా సేకరించారా అని ప్రశ్నించారు సీజేఐ.
ఆధారాలు ఉంటే సమర్పించాలని కానీ ఇలాంటి అసంబద్దమైన వాదనలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. స్వలింగ సంపర్కుల వివాహ హక్కులను కోరుతూ దాఖలైన పిటిషన్లు పట్టణ ఉన్నత వర్గాల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయని కేంద్రం నివేదికను సమర్పించింది. దీనిపై సీరియస్ గా స్పందించారు సీజేఐ ధనంజయ చంద్రచూడ్. ఈ అంశాన్ని విచారించడాన్ని కేంద్రం ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. కానీ ధర్మాసనం దీనిపై సీరియస్ గా తీర్పు చెప్పేందుకు రెడీ అయ్యింది.
Also Read : ఓటీటీలదే రాజ్యం చర్యలు శూన్యం