Pegasus Spyware : పెగాసస్ స్పైవేర్ పై సీజేఐ షాకింగ్ కామెంట్స్
నివేదిక లేకుండా కామెంట్ చేయలేం
Pegasus Spyware : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ పై(Pegasus Spyware) భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 5 ఫోన్లలో మాల్వేర్ ఉందని, అయితే పెగాసస్ స్పైవేర్ కు ఖచ్చితమైన ఆధారాలంటూ ఏవీ ఇంత దాకా తమకు లభించ లేదని స్పష్టం చేసింది.
కాగా పూర్తి నివేదికను పరిశీలించకుండా ఇక పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని తాము నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana).
ఈ కేసును నాలుగు వారాల పాటు వాయిదా పడింది. ఇప్పటి వరకు మొత్తం 29 ఫోన్లను పరిశీలించామని , 5 ఫోన్లలో మాల్ వేర్ లు కనిపించాయని తెలిపారు.
అయితే పెగాసస్ స్పైవేర్ కు సంబంధించి ఎటువంటి నిశ్చయాత్మక రుజువు లేదన్నారు ఎన్వీ రమణ. భారత ప్రభుత్వం సహకరించడం లేదని కమిటీ చెప్పిందంటూ ప్రధాన న్యాయమూర్తి చెప్పడం విశేషం.
ఈ నివేదికను మూడు భాగాలుగా సమర్పిస్తున్నట్లు కోర్టు తెలిపింది. టెక్నికల్ కమిటీకి సంబంధించి రెండు నివేదికలు, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. వి. రవీంద్రన్ పర్యవేక్షణ కమిటీ నివేదిక సమర్పించింది.
నివేదికలోని ఒక భాగాన్ని సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో పబ్లిక్ గా ఉంచుతామని పేర్కొంది. పిటిషనర్లలో కొందరు నివేదిక లోని మొదటి రెండు భాగాల కాపీని కోరారు. డిమాండ్ ను కోర్టు పరిశీలిస్తుందని సీజేఐ తెలిపారు.
కాగా పూర్తి నివేదికను పబ్లిక్ డొమైన్ లో ప్రచురించ వద్దంటూ కమిటీ కోరింది.
Also Read : మనీ లాండరింగ్ చట్టం తీర్పుపై సమీక్ష