CJI Chandrachud OROP : సీల్డ్ క‌వ‌ర్ వ్యాపారం ముగించండి – సీజేఐ

భార‌త అటార్నీ జ‌న‌ర‌ల్ పై సీరియ‌స్

CJI Chandrachud OROP Case : భార‌త స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజయ వై చంద్ర‌చూడ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేగింది. సీల్డ్ క‌వ‌ర్ వ్యాపారాన్ని ముగించాల‌న్నారు. సీల్డ్ క‌వ‌ర్లు పూర్తిగా వ్య‌తిరేకంగా స్థిర ప‌డిన న్యాయ సూత్రాల‌కు విరుద్ద‌మ‌ని మండిప‌డ్డారు సీజేఐ. ఇది ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డం గురించి, ఇక్క‌డ ర‌హ‌స్యం ఏమిటి అని పేర్కొన్నారు. వ‌న్ ర్యాంక్ వ‌న్ పెన్ష‌న్ కేసుపై సోమ‌వారం సుప్రీంకోర్టులో విచార‌ణ చేప‌ట్టారు సీజేఐ(CJI Chandrachud OROP Case).

కోర్టుల‌కు స‌మ‌ర్పించేందుకు సీల్డ్ క‌వ‌ర్ ఎన్వ‌ల‌ప్ ల‌ను ఉప‌యోగించే ప‌ద్ద‌తిపై మండిప‌డ్డారు. పింఛ‌న్ చెల్లింపుపై ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ నిర్ణ‌యాన్ని పేర్కొంటూ భార‌త అటార్నీ జ‌న‌ర‌ల్ స‌మ‌ర్పించిన సీల్డ్ క‌వ‌ర్ ను అంగీక‌రించేందుకు సీజేఐ నిరాక‌రించారు. దానిని చ‌ద‌వాల‌ని లేదా తిరిగి తీసుకోవాల‌ని ప్ర‌భుత్వ అత్యున్న‌త న్యాయ‌వాదిని కోరారు.

తాము ఎటువంటి ర‌హ‌స్య ప‌త్రాలు లేదా సీల్డ్ క‌వ‌ర్లు తీసుకోము. వ్య‌క్తిగ‌తంగా దీనికి విముఖ‌త ఉంది. కోర్టులో పార‌ద‌ర్శ‌క‌త ఉండాలి. ఇది ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డం గురించి. ఇక్క‌డ గోప్య‌త ఏమిటి ..ఎందుకు ఉండాల‌ని సీరియ‌స్ గా స్పందించారు..ఏజీని ప్ర‌శ్నించారు సీజేఐ చంద్ర‌చూడ్(CJI Chandrachud). సుప్రీంకోర్టు దానిని అనుస‌రిస్తే హైకోర్టులు కూడా ఇదే ప‌ద్ద‌తిని అనుస‌రించే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు.

ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు సీజేఐ. సీల్డు క‌వ‌ర్లు తీసుకోవ‌డం న్యాయ సూత్రాల‌కు పూర్తిగా విరుద్ద‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అనంత‌రం ఏజీ చ‌దివి వినిపించారు. బ‌డ్జెట్ ఖ‌ర్చు వ‌ల్ల ఒకేసారి తీర్చ‌లేక పోయింది. వ‌న‌రులు ప‌రిమితంగా ఉన్నాయి. ఖ‌ర్చును నియంత్రించాల్సి ఉంది అని చ‌దివారు.

Also Read : ఎవ‌రీ శ్రీ‌ధ‌ర్ వెంబు ఏమిటా క‌థ

Leave A Reply

Your Email Id will not be published!