Arvind Kejriwal Delhi LT : గీత దాటినా గౌరవం తప్పదు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal Delhi LT : ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal Delhi LT) మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ సందర్భంగా ఆప్ చీఫ్ , సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు గీత లేదా లక్ష్మణ రేఖ దాటినా ప్రజాస్వామ్యంలో గౌరవించడం అన్నది ముఖ్యమని స్పష్టం చేశారు.
ఆయన ఎల్జీ సక్సేనాను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి సర్కార్ కు కొన్ని గీతలు ఉంటాయని వాటిని దాటినట్లు తనకు అనిపిస్తోందంటూ నర్మగర్భంగా ఎల్జీ వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం సున్నితంగా ప్రస్తావిస్తూనే ఘాటుగా వ్యాఖ్యానించారు.
అయితే సక్సేనా మాట్లాడుతూ తన ఆఫీసుకు ఆప్ సర్కార్ మధ్య కొన్ని గీతలు ఏర్పడ్డాయన్నారు. అయితే ఇద్దరి సంబంధాలు విచ్ఛిన్నం కాలేదన్నారు. ఈ సందర్బంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) జోక్యం చేసుకుని ..ఇవి చిన్న సమస్యలేనని అయితే డెమోక్రసీని గౌరవించాలని తనకు అర్థమైందన్నారు. రెండు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేసేందుకు అనుమతి ఇవ్వాలని , పని చేయనీయకుండా అడ్డంకులు పెట్ట వద్దని కోరారు.
లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీజేపీ జోక్యం చేసుకోవడాన్ని సభా స్వరూపాన్ని ఉల్లంఘించడమేనని కేజ్రీవాల్ అన్నారు. ఇది ఒకరకంగా సభను ధిక్కరించడమే. సభ ఈమేరకు తీర్మానం కూడా చేసిందన్నారు. ఆయన ప్రసంగిస్తుండగా ఆప్ , బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.
ఇది ఒక విధంగా సభను ధిక్కరించడమే అవుతుంది. ఎల్జీ ప్రసంగంలో ఎలాంటి అవాంతరాలు జరగ కూడదని సభ మొత్తం తీర్మానం చేసిందన్నారు సీఎం.
Also Read : సిసోడియాకు షాక్ కస్టడీ పొడిగింపు