Arvind Kejriwal : మమతతో కేజ్రీవాల్ భేటీ
ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరు
Arvind Kejriwal : కేంద్రం ఢిల్లీ సర్కార్ కు వ్యతిరేకంగా తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు శ్రీకారం చుట్టారు ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఢిల్లీ పోస్టింగ్ ల విషయంలో ఆప్ ప్రభుత్వానికి అధికారం లేకుండా చేసింది కేంద్రం. దీనిని తప్పు పట్టారు సీఎం. ఇప్పటికే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య అధికారాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేవలం శాంతి భద్రతలు, భూ వ్యవహారాలకు సంబంధించి అంశాలు మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉంటాయని మిగతావన్నీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉంటాయని స్పష్టం చేసింది.
ఇంత లోనే కోర్టును కాదని కేంద్రం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. దీనిని లోక్ సభలో ప్రవేశ పెట్టినా గెలుస్తుంది కానీ రాజ్యసభలో కొంచెం కష్టం. ఏదైనా చట్టం కావాలంటే అటు లోక్ సభ తో పాటు ఇటు రాజ్యసభలో కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతిపక్షాలన్నింటితో కలిపి ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఇందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు కోల్ కతాకు వచ్చారు. ఈ సందర్బంగా ఇద్దరు సీఎంలు సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం బీజేపీయేతర ప్రభుత్వాలు, పార్టీలు, ప్రజాప్రతినిధుల పట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి కేజ్రీవాల్ దీదీతో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Also Read : Manish Sisodia
