Arvind Kejriwal : పేదరికం లేని దేశం కావాలి
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక్కటే కల ఉందని అది పేదరికం లేనటువంటి భారత దేశంగా చూడాలని ఉందని అన్నారు. ఇండియాను ప్రపంచంలోనే నెంబర్ 1గా మార్చాలని కలలు కన్నానని చెప్పారు సీఎం. ఇందు కోసం కష్టపడే, శ్రమించే యువత నుండి మద్దతు కావాలని కోరుకుంటున్నానని అన్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. నేను ఐఐటీ నుండి వచ్చాను. బాగా చదువుకున్నాను.
నేను తెలుసుకున్నది ఏమిటంటే విద్యా పరంగా ఉన్నత స్థానంలో ఉంటే అవకాశాలు అపారంగా అందుకోవచ్చని. అందుకే తాను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా ఢిల్లీ ప్రభుత్వం బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ దేశంలో ఎక్కడా లేని రీతిలో విద్యా వ్యవస్థను అత్యంత పటిష్టవంతం చేశానని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).
నా వరకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉందని స్పష్టం చేశారు సీఎం. కేంద్రంలో కొలువు తీరిన వారికి విద్య ప్రాధాన్యత గురించి తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వాళ్లు చదువుకున్న నన్ను ఆట పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. అడుగడుగునా వాళ్లు నన్ను అడ్డుకోవాలని చూశారని అయినా ఎక్కడా తాను తగ్గలేదన్నారు అరవింద్ కేజ్రీవాల్. కష్టపడితే విద్యా రంగాన్ని అభివృద్ది చేస్తే 10 ఏళ్లలో భారత్ టాప్ లో ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read : Bandi Sanjay : కొల్లగొట్టడం బీఆర్ఎస్ నమూనా – బండి