Ashok Gehlot : రాజస్థాన్ ఎమ్మెల్యేలకు సీఎం భరోసా
కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ
Ashok Gehlot : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా తాను ఎక్కడికీ వెళ్లడం లేదని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యేలకు. ఇదిలా ఉండగా ఈ తరుణంలో ఒకవేళ పార్టీ చీఫ్ గా ఎన్నికైతే రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ స్థానంలో సచిన్ పైలట్ కు అప్పగిస్తారన్న ప్రచారం జోరందుకుంది.
దీనిపై సీరియస్ గా స్పందించారు సీఎం. తాను ఢిల్లీకి వెళ్లినా రాజస్థాన్ లో ఉంటానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సచిన్ పైలట్ ప్రధాన పోటీదారుగా గత కొంత కాలం నుంచీ కొనసాగుతూ వస్తున్నారు.
2020లో ఏకంగా పైలట్ అశోక్ గెహ్లాట్ పై యుద్దం ప్రకటించారు. చివరకు ప్రభుత్వాన్ని కూడా పడగొట్టేలా చేసింది. ఈ తరుణంలో తాజాగా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot).
తాను ఇక్కడే ఉంటానని ఎక్కడికీ వెళ్లనని కుండ బద్దలు కొట్టారు. ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ కు సంబంధించిన అంశం హాట్ టాపిక్ గా మారింది.
71 ఏళ్ల వయసు కలిగిన అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎంపిక కావడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రాజస్థాన్ బాద్ షా ఎవరనేది త్వరలో తేలనుంది.
పార్టీ పరంగా తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ పూర్తిగా అశోక్ గెహ్లాట్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.
Also Read : రాజస్థాన్ పైనే అశోక్ గెహ్లాట్ ఫోకస్