Bhagwant Mann : గ‌న్ క‌ల్చ‌ర్ పై సీఎం ఉక్కు పాదం

రాష్ట్రంలో పూర్తిగా నిషేధం

Bhagwant Mann : పంజాబ్ రాష్ట్రంలో గ‌న్ క‌ల్చ‌ర్ రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌ముఖ సింగ‌ర్ సిద్దూ మూసే వాలాను లారెన్స్ గ్యాంగ్ మ‌ట్టు బెట్టింది. మ‌రో గాయ‌కుడిపై దాడి జ‌రిగింది. ఇంకో వైపు న‌టుడు స‌ల్మాన్ ఖాన్ ను చంపుతామంటూ బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌డం కూడా చ‌ర్చ‌కు దారి తీసింది.

పంజాబ్ కు సంబంధించి పెద్ద ఎత్తున గ‌న్ క‌ల్చ‌ర్ తో పాటు డ్ర‌గ్స్ కు అడ్డాగా మారి పోయింద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీనికంతటికీ గ‌తంలో ఏలిన పాల‌కులే కార‌ణ‌మంటూ ఆరోపించారు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann). ఆయ‌న సీఎంగా కొలువు తీరిన వెంట‌నే గ‌న్ క‌ల్చ‌ర్ ను కంట్రోల్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

తాజాగా అవ‌స‌ర‌మైతే త‌ప్ప ఎవ‌రికీ గ‌న్స్ ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ త‌రుణంలో తాజాగా తుపాకీ సంస్కృతికి చెక్ పెట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు సీఎం. ఈ మేర‌కు పంజాబ్ లో భారీ అణిచి వేత‌లో ఆయుధాలు నిషేధించ బ‌డ్డాయి. అక్ర‌మంగా ఆయుధాలు లేదా గ‌న్స్ క‌లిగి ఉంటే వారిని అదుపులోకి తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది స‌ర్కార్.

ఆయుధాలు లేదా హింస‌ను కీర్తిస్తూ పాట‌లు రాసినా లేదా పాడినా వాటిని కూడా నిషేధం విధిస్తామ‌ని హెచ్చ‌రించింది. దీని వ‌ల్ల చాలా మటుకు ఆయుధాల‌ను వాడ‌డం త‌క్కువైంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ఆయుధాల నియంత్ర‌ణ‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేసింది. ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో ఆయుధాల బ‌హిరంగ ప్ర‌ద‌ర్శ‌నను నిలిపి వేసింది.

సీఎం భ‌గ‌వంత్(Bhagwant Mann) మాన్ క‌ఠిన‌మైన సూచ‌న‌లు జారీ చేశారు. తాజా సూచ‌న‌ల ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు జారీ చేసిన అన్ని ఆయుధాల లైసెన్సుల‌ను రాబోయే మూడు నెల‌ల్లో ప‌రిశీలిస్తారు. జిల్లా క‌లెక్ట‌ర్ సంతృప్తి చెందితే త‌ప్ప కొత్త లైసెన్స్ మంజూరు చేసే ప్ర‌స‌క్తి లేద‌ని ప్ర‌క‌టించారు.

Also Read : స‌మ‌స్య‌ల‌పై యుద్దం స‌ర్కార్ పై పోరాటం

Leave A Reply

Your Email Id will not be published!