Bhupesh Baghel : కేంద్రం నిర్వాకం ఆర్మీ బలహీనం
ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్
Bhupesh Baghel : కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ సర్కార్ నిర్వాకం వల్ల భారత దేశానికి చెందిన ఆర్మీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్(Bhupesh Baghel) . అగ్ని వీర్ ను కావాలని తీసుకు వచ్చిందని మండిపడ్డారు. అత్యంత బలహైన సైన్యాన్ని మరింత బలహీనం చేయడంలో భాగంగానే అగ్నిపథ్ ను తీసుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చైనా కావాలని దాడికి దిగుతోంది. కానీ భారత ప్రభుత్వం సిద్దంగా లేదన్నారు సీఎం. ప్రతిపక్షాలు చర్చించేందుకు సిద్దంగా ఉన్నా ఎందుకని మోదీ సర్కార్ వెనక్కి తగ్గుతోందంటూ నిలదీశారు. భూపేష్ బాఘేల్ మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకాన్ని సైన్యాన్ని దెబ్బ కొట్టేందుకు తీసుకు వచ్చిందని ఆరోపించారు.
దేశానికి సంబంధించి సరిహద్దు వద్ద ఉద్రిక్తత నెలకొన్న సమయంలో ఏం జరుగుతోందన్న విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు సీఎం. ఇదిలా ఉండగా సరిహద్దు వివాదంపై చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీతో ఇతర పార్టీలు కూడా కోరాయని తెలిపారు. కానీ లోక్ సభ, రాజ్యసభ చైర్మన్లు ఒప్పు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా బుధవారం పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కావాలని చర్చించేందుకు బీజేపీ సర్కార్ ఒప్పుకోక పోవడం దారుణమన్నారు.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. చైనాకు మోదీ భయపడుతున్నారంటూ ఆరోపించారు.
Also Read : సరిహద్దు వివాదం సోనియా ఆగ్రహం