CM Bommai : స‌రిహ‌ద్దు వివాదం బొమ్మై ఢిల్లీకి ప‌య‌నం

సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసే యోచ‌న‌

CM Bommai : మహారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల మధ్య నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం మ‌రింత ముదిరింది. మ‌రాఠా స‌రిహ‌ద్దులోని 40 గ్రామాల‌ను తాము విలీనం చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు క‌ర్ణాట‌క సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై(CM Bommai) . ఈ మేర‌కు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశామ‌ని వెల్ల‌డించారు.

దీంతో మహారాష్ట్రలో ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు , మాజీ డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ , శివ‌సేన పార్టీ చీఫ్‌, మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే, మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రేతో పాటు ఆ పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ సైతం నిప్పులు చెరిగారు.

ఇదిలా ఉండ‌గా ఒక్క అంగుళం భూమిని వ‌దులుకునే ప్ర‌స‌క్తి లేదంటూ హెచ్చ‌రించారు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే. దీంతో ఇరు రాష్ట్రాల మ‌ధ్య మాట‌ల యుద్దం మొద‌లైంది. విచిత్రం ఏమిటంటే మ‌హారాష్ట్ర‌లో బీజేపీ, శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేల‌తో క‌లిసి సంకీర్ణ స‌ర్కార్ ఉండ‌గా క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం న‌డుస్తోంది.

కానీ ఉద్రిక్త ప‌రిస్థితులు మ‌రింత‌గా చెల‌రేగ‌డంతో చెక్ పెట్టేందుకు డిసైడ్ అయ్యారు క‌ర్ణాట‌క సీఎం బొమ్మై(CM Bommai) . ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను న‌వంబ‌ర్ 29న మంగ‌ళ‌వారం ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళుతున్నాన‌ని చెప్పారు.

ఇందులో భాగంగా తాను బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో పాటు ముకుల్ రోహ‌త్గీని క‌లుస్తాన‌ని వెల్ల‌డించారు. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు వివాదం గురించి సుప్రీంకోర్టులో తేల్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు బ‌స్వ‌రాజ్ బొమ్మై.

Also Read : ఆసామీల‌కు దోచి పెడుతున్న మోదీ – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!