CM Chandrababu: 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న సీఎం చంద్రబాబు
250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఏపీలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పీ4 పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రకారం సమాజంలో ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉన్న కుటుంబాలు, పారిశ్రామిక వేత్తలు… సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను దత్తత తీసుకుని వారికి ఆర్ధికంగా సహాయం చేయడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో దత్తత తీసుకునే వ్యక్తులను మార్గదర్శులుగా పిలుస్తారు. జీరో పోవర్టీ లక్ష్యంగా చేపట్టిన పీ4 కార్యక్రమంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులు, ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా #IAmMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజక వర్గ స్పెషల్ ఆఫీసర్లు హాజరయ్యారు.
CM Chandrababu Adopt
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ… తన అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాల దత్తత తీసుకున్నట్లు వివరించారు. మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరం ఉందని తెలిపారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగిందని… విశాఖపట్నం జిల్లా చివరలో ఉందన్నారు. బంగారు కుటుంబాలకు సాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆ క్రమంలో పీ4లో మార్గదర్శులుగా ముఖ్యమంత్రితోపాటు ఆయన కుటుంబ సభ్యులు భాగస్వాములుగా మారారు.
‘‘పీ4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోంది. పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలి. కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లదే. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలి. బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్టు 10లోపు పూర్తిచేయాలి. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను ‘మార్గదర్శులు’ దత్తత తీసుకునేలా చూడాలి’’ అని సీఎం ఆదేశించారు.
Also Read : MLC Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
