CM Chandrababu: వైసీపీ దుష్ప్రచారంపై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు

వైసీపీ దుష్ప్రచారంపై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందంటూ ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ, వైసీపీ (YSRCP) విష ప్రచారం చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ ఫేక్ ప్రచారంతో రైతులను గందరగోళానికి గురిచేస్తున్న వైసీపీ మీడియా, అనుబంధ సోషల్ మీడియాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. వైసీపీ చేసిన గులకరాయి, గుండెపోటు, కోడికత్తి డ్రామా, బ్లాక్‌మెయిల్‌ డ్రామాలకు కాలం చెల్లిందని ఆయన స్పష్టం చేసారు. వైసీపీకు ప్రజా సమస్యలపై శ్రద్ధ ఉంటే… అందుకు అనుగుణంగా పనిచేయాలి అని సీఎం చంద్రబాబు హితవు పలికారు.

CM Chandrababu Slams YSRCP

రాష్ట్రంలోని ఎరువుల లభ్యతపై సచివాలయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) మీడియాతో మాట్లాడారు.అన్ని జిల్లాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని… అయితే కొన్ని చోట్ల కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారన్నారు. దారి మళ్లించిన వారిపై కేసులు నమోదు చేశామని, రూ.3కోట్ల విలువైన యూరియాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సకాలంలో యూరియా, ఎరువులు సరఫరా చేయడమే మా లక్ష్యం. యూరియాకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందవద్దు.

ప్రస్తుతం రాష్ట్రంలో 6.65లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. త్వరలో 2.71లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుంది. నాలుగేళ్లలో సగటున 36.71లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు వాడాలనుకున్నాం. గత పదిరోజుల్లో 25వేల మె.ట యూరియా పంపిణీ చేశాం. మరో పది రోజుల్లో 44,580 మె.ట యూరియా వస్తోంది. ఏ రైతుకు యూరియా కొరత లేకుండా చూడాలని ఆదేశించాం. ఆధార్‌ ద్వారా ఎవరికెంత యూరియా కావాలో పంపిణీ చేస్తాం. ఎరువుల అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.

రాష్ట్రంలో నేర్థులు ఎక్కువయ్యారు. కృష్ణా జిల్లాలో యూరియా లారీని వైసీపీ నేత అడ్డుకొని వివాదం చేశాడు. రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు రాజకీయాలు చేస్తే ఖబడ్దార్‌. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తారని ఎవరు చెప్పారు ? ప్లాంట్‌ సమర్థతను పెంచడానికి కొన్ని సర్వీసులను ఔట్‌సోర్సింగ్‌ చేస్తారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.12వేల కోట్లు నిధులు వచ్చాయి. ఔట్‌సోర్సింగ్‌ నెపంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఫేక్‌ రాజకీయాలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టను. సామాజిక మాధ్యమాల్లో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సహించం. ఎరువుల కొరత ఉందని చెబితే… అక్కడికి నేనే వెళ్తా. నిజంగా యూరియా కొరత ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటాం. యూరియా కొరత లేకున్నా దుష్ప్రచారం చేస్తే జైలులో వేస్తాం. ప్రతిపక్ష హోదా అడగడానికి వైకాపాకు బుద్ధి ఉందా? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మేము కాదు.. ప్రజలు. వాళ్ల అరాచకాలు చూసి.. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు.

Also Read : MLC Kavitha: బీఆర్ఎస్ బహిష్కృత నేత కవిత సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!