CM Chandrababu: పోలీస్ శాఖ ప్రక్షాళనకు సీఎం చంద్రబాబు సన్నాహాలు !
పోలీస్ శాఖ ప్రక్షాళనకు సీఎం చంద్రబాబు సన్నాహాలు !
CM Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు శుక్రవారం భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం హత్య ఘటనపై సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు డీజీపీ ద్వారకా తిరుమల రావు వివరించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగ కుండా చూసుకోవాలని ఏపీ సీఎం ఆదేశించారు. త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. శాంతిభద్రతలు తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు తెలిపారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈపూరుపాలెం ఘటనలో దోషులకు వెంటనే కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరించాలని సీఎం ఆదేశించారు.
CM Chandrababu….
ఈ సందర్భంగా పోలీసు శాఖలో చేపట్టాల్సిన ప్రక్షాళనపై సీఎం చంద్రబాబు డీజీపీకు కీలక ఆదేశాలు జారీ చేసారు. గత ప్రభుత్వంలో వైసీపీతో అంటకాగిన ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులపై సమగ్రమైన సమాచారం సేకరించాలని సూచించారు. ఈ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా… నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేసే అధికారుల జాబితాను సిద్ధం చేయాలని డీజీపీకు సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం సచివాలయం నుంచి ఉండవల్లిలోని నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు.
Also Read : Ayyannapatrudu Chintakayala: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక !