CM Chandrababu Naidu: చంద్రబాబు పర్యటనలో ఎమ్మెల్యే కొలికపూడికి అవమానం !
చంద్రబాబు పర్యటనలో ఎమ్మెల్యే కొలికపూడికి అవమానం !
CM Chandrababu Naidu : బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఘోర అవమానం జరిగింది. గత కొంతకాలంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబును పలువురు నేతలు హెలిప్యాడ్ వద్ద పుష్ఫగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో పాటు వెళ్ళిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును… సీఎం చంద్రబాబు అస్సలు పట్టించుకోలేదు. మహిళా నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులను పేరుపేరునా పలకరించిన చంద్రబాబు… ఎమ్మెల్యే కొలికపూడితో కరచాలనం కాదుకదా కనీసం ముఖం కూడా చూడలేదు. దీనితో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
CM Chandrababu Naidu Meeting
బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu Naidu) ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో పర్యటనకు వచ్చారు. ముప్పాళ్లలో హెలికాప్టర్ దిగిన చంద్రబాబు… అక్కడున్న టీడీపీ నేతలను పలికరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి(Kolikapudi Srinivasarao) కూడా చంద్రబాబుకు నమస్కరించారు… ఆయన్ను చూసిన బాబు ముఖంలో సీరియస్‌నెస్ కనిపించింది. దీనితో, కొలికపూడిని పట్టించుకోకుండా… చూసీచూడనట్టుగా బాబు ముందుకు సాగారు. ఇక, పక్కనే ఉన్న టీడీపీ ఇతర నేతలు కూడా ముందుకు రావడంతో కొలికపూడి వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడిని చంద్రబాబు కనీసం పట్టించుకోలేదు. కరచాలనం కూడా ఇవ్వలేదు. మరోవైపు… ప్రజావేదిక స్టేజ్‌పైన కూడా కొలికపూడికి అవకాశం దక్కలేదు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మట్లాడుతూ… 2029 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకుల కంటే కార్యకర్తలపైనే తనకు అభిమానం ఎక్కువని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా హెలీకాప్టర్ ద్వారా నందిగామ హెలీ ప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం ముప్పాళ్ల గ్రామానికి రోడ్డుమార్గాన చేరుకుని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీ-4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల ఇళ్లకు వెళ్లారు. స్వయంగా టీ కాచి వారికి ఇచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
Also Read : Missing Case: సికింద్రాబాద్ లో ఒకే కుటుంబంలో ఆరుగురు అదృశ్యం