CM Chandrababu Naidu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ !

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ !

CM Chandrababu Naidu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ఈ లేఖలో ప్రస్తావించారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని ఈ సందర్భంగా కోరారు. విభజన జరిగి పదేళ్లు దాటినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పరస్పర సహకారం.. తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని లేఖలో తెలిపారు. ఈనెల 6న ముఖాముఖి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు లేఖలో ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాలను సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లు చంద్రబాబు లేఖలో వెల్లడించారు.

CM Chandrababu Naidu Letter

చంద్రబాబు లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా… తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు(CM Chandrababu Naidu) శిష్యుడుగా రాజకీయ తెలంగాణ రాజకీయాల్లో గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి… ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి పిసిసి అధ్యక్షుడి స్థానాన్ని సంపాదించుకున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించింది. కూటమి ప్రధాన అభ్యర్థిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చలకు చంద్రబాబు లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : Medha Patkar: పరువునష్టం కేసులో మేధా పాట్కర్‌ కు అయిదు నెలల జైలుశిక్ష !

Leave A Reply

Your Email Id will not be published!