CM Chandrababu Naidu: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ

CM Chandrababu : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు… కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు అంశాలను కేంద్రమంత్రికి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజును గోవా గవర్నర్‌ గా నియమించిన నేపథ్యంలో అమిత్‌షాకు సీఎం థాంక్స్‌ చెప్పారు.

వైసీపీ హయాంలో రాష్ట్రంలో ధ్వంసమైన ఆర్థికవ్యవస్థను కేంద్రం అండతో గాడిలో పెడుతున్నామని అమిత్‌ షాకు చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మరింత సహకారం అందించాలని కోరారు. బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును రూ.82వేల కోట్లతో ప్రతిపాదించినట్లు తెలిపారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందన్నారు. ఏపీ ఎదుర్కొంటున్న నష్టంపై ఆర్థిక సంఘానికి నివేదించినట్లు అమిత్‌షాకు సీఎం తెలిపారు.

CM Chandrababu – మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రశంసలు కురిపించారు. ‘లైఫ్‌ అండ్‌ లెగసీ ఆఫ్‌ పీవీ’ అంశంపై సీఎం ఢిల్లీలో ప్రసంగించారు. అనేక పార్టీలను ఒప్పించి పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చారని చంద్రబాబు అన్నారు. ‘దేశంలో లైసెన్స్‌ రాజ్‌ విధానానికి స్వస్తి చెప్పారు. పెట్టుబడిదారులు సులభంగా వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దేశంలో పారిశ్రామిక పురోగతికి బాటలు వేశారు. పీవీ తీసుకున్న చర్యల వల్లే ఐటీ విప్లవం వచ్చింది. పీవీ తెచ్చిన సంస్కరణలను వాజ్‌పేయీ కొనసాగించారు. వాజ్‌పేయీ హయాంలో హైవేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు వచ్చాయన్న చంద్రబాబు… 2014లో మోదీ కూడా అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు.

‘మోదీ హయాంలో భారత్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది… అనేక దేశాలతో మోదీ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌’ పేరుతో ముందుకెళ్తున్నాం… ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచాం. యువత ఆశలు, ఆకాంక్షల సాధనకు మోదీ కృషి చేస్తున్నారు. వికసిత్‌ భారత్‌ పిలుపుతో దేశ రూపురేఖలు మారుతున్నాయి. ప్రపంచం ఎదుర్కొనే అనేక సమస్యలకు మనం పరిష్కారం చూపిస్తున్నాం… మోదీ సంస్కరణల వల్ల దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అని చంద్రబాబు చెప్పారు.

Also Read : Minister Satya Kumar Yadav: విశాఖ జిల్లాలో ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన

Leave A Reply

Your Email Id will not be published!