CM Chandrababu Naidu: బిల్‌గేట్స్ తో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ
బిల్‌గేట్స్ తో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu Naidu : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)… మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్ తో… ఏపీ ప్రభుత్వం తరపును సీఎం చంద్రబాబు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీకి సహకారం అందించడానికి గేట్స్ ఫౌండేషన్ అంగీకరించింది. దీనిలో భాగంగా వీటికి సంబంధించిన అంశాలపై గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు.
CM Chandrababu Naidu Meet Bill Gates
ఈ సందర్భంగా బిల్ గేట్స్ తో తనకున్న అనుభావాలను సీఎం చంద్రబాబు నెమరు వేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం తొలిసారి నేను బిల్స్‌గేట్స్ ను కలవాలనుకున్నాను. అందుకు బిల్‌గేట్స్ కార్యాలయం నుంచి నో అనే సమాధానం వచ్చింది. అయినా నేనున పట్టువదలని విక్రమార్కుడిలాగా మళ్లీ మళ్లీ ప్రయత్నించాను. అప్పుడు ఓ చిన్న అవకాశం దొరికింది. బిల్‌గేట్స్ కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ నిరాశపడకుండా… దాన్నో అద్భుతమైన అవకాశంగా మార్చుకుని ఏపీ మీద తనకున్న ప్రేమను, అభివృద్ధి చేయాలనే ఆకాంక్షను, ప్రణాళికలను బిల్‌గేట్స్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాను. నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ముగ్ధుడయిన బిల్‌గేట్స్ … 10 నిమిషాల సమావేశాన్ని 45 నిమిషాల వరకు కొనసాగించి… హైదరాబాద్ కు పర్యటనకు ఓకే చెప్పారు. బెంగుళూరులో నెలకొల్పాలనుకున్న మైక్రోసాఫ్ట్ కంపెనీను హైదరాబాద్ లోనే పెట్టారు అంటూ తన అనుభవాలను సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
Also Read : Vivek Venkataswamy : మాలల కంటే మాదిగ ఉద్యోగులే ఎక్కువ – ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి