CM Chandrababu Naidu: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తో చంద్రబాబు భేటీ

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తో చంద్రబాబు భేటీ

CM Chandrababu : దిల్లీ పర్యటనల ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu)… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. సాస్కి కింద అదనంగా రూ.10వేల కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. రెవెన్యూ లోటు భర్తీకి 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన వినతిని అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతికి రెండో విడత నిధులను గ్రాంటుగా విడుదల చేయాలని అభ్యర్థించారు. విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికీ ఆర్థిక లోటును ఎదుర్కొంటోందని నిర్మల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరిస్తున్నందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.

CM Chandrababu – ఏడాదిలో 10లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం – సీఎం చంద్రబాబు

ఏపీలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలో 10లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది 13 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ‘స్వర్ణాంధ్రప్రదేశ్‌-2047’పై టాటా సంస్థల ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ తమ నివేదికను సీఎంకు దిల్లీలో అందజేసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి నివేదికలో టాస్క్‌ఫోర్స్‌ పలు సూచనలు చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

‘‘ప్రస్తుతం కాలంలో సాంకేతికత అనేది గేమ్‌ ఛేంజర్‌. ఈ సాంకేతిక యుగంలో ప్రభుత్వాల వద్ద ప్రజల డేటా ఉంటుంది. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి వాట్సప్‌లో మరిన్ని పౌర సేవలు అందుబాటులో వస్తాయి. కుప్పం నుంచి డిజిటల్‌ హెల్త్‌ కార్డుల కార్యక్రమం చేపడతాం. ఏపీలో చాలా అవకాశాలు ఉన్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి వ్యాపారానికి అనుకూల నగరాలు. విశాఖకు గూగుల్‌ రాబోతోంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం పీ-4 పాలసీ తీసుకొచ్చాం’’ అని చంద్రబాబు వివరించారు.

Also Read : Mallu Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు బీజేపీ చీఫ్ లీగల్ నోటీసులు

Leave A Reply

Your Email Id will not be published!