CM Chandrababu Naidu: ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ
ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ
CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. మంగళవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ… డీఎస్సీపై స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రకటిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్ లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
CM Chandrababu Naidu Key Updates Mega DSC
కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) మాట్లాడుతూ… ‘‘గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదు. గత పాలనతో విసిగి మాకు విస్తృత మద్దతు ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలి. వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. జూన్‌లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలి’’ అని చంద్రబాబు అన్నారు.
అలాగే మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తాం. రూ.15 వేల చొప్పున… ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తాం. అయోమయంలో పడేసిన పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టాం. రాజధాని అమరావతి ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేస్తాం. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి సంస్థల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం.
‘‘స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు 10 సూత్రాల ఆధారంగా పనిచేయాలి. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకూ ప్రణాళికలు చేరాల్సిందే. జీఎస్‌డీపీ, జీవీఏలతో పాటు తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెంచాలి. వచ్చే ఏడాదికి 15 శాతం ప్లస్ జీఎస్‌డీపీ సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలి. వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’’ అని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.
Also Read : Gorantla Butchaiah Chowdary: జగన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు