CM Chandrababu Naidu: పేదరికం లేని సమాజం కోసమే P4 విధానం – సీఎం చంద్రబాబు
పేదరికం లేని సమాజం కోసమే P4 విధానం - సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu : సమాజంలో మార్పు తీసుకురావడం ద్వారా… పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికోసం పీ4 విధానం అమల్లోకి తీసుకువస్తున్నామని అన్నారు. జీరో పావర్టీ లక్ష్యంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్‌షిప్ మోడల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న పదిశాతం మంది… 20 శాతం నిరుపేదలను… ఆదుకుని పైకి తీసుకొచ్చేలా P4 కార్యక్రమం రూపకల్పన చేశామన్నారు. దశల వారీగా 50 లక్షల మంది నిరుపేదలను ఆదుకునేలా కార్యక్రమం చేపట్టారు. P4 కోసం ఇప్పటికే 28 లక్షల కుటుంబాలను ఏపీ ప్రభుత్వం గుర్తించిందని… P4తో లబ్ధి పొందే వారిని ‘బంగారు కుటుంబం’గా నామకరణం చేసామన్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో కలిసి P4 కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా P4 లోగో, పోర్టల్‌ను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు.
CM Chandrababu Naidu Comment
తొలి P4 కుటుంబంగా మంగళగిరి పరిధి కురగల్లుకు చెందిన… కడియం నరసింహ, సుశీల ఎంపిక చేసింది. రెండో బంగారు కుటుంబంగా ఇమాన్యుయేల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. భవిష్యత్‌లో అమరావతి రూపురేఖలు మారిపోతాయని అన్నారు. అమరావతి గొప్పగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. చంద్రబాబు పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. తప్పకుండా పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు, యువత భవిష్యత్ బాగుండాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు.
తన జీవితం ప్రజా సేవకే అంకితమని ఏపీ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ దగ్గర కఠోరమైన క్రమశిక్షణ నేర్చుకున్నానని… తాను జీవితంలో ఏ తప్పు చేయలేదని… తాను ఎప్పుడూ తప్పు చేయనని తెలిపారు. తన జీవితం ప్రజాసేవకే అంకితమని.. తనకు మరే కోరికలు లేవని అన్నారు. తాను 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి 4 సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని గుర్తుచేశారు. అవినీతి లేని పాలన అందించడం తన సుపరిపాలన అని ఉద్ఘాటించారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిoచానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
తన కుటుంబం కోసం హెరిటేజ్ సంస్థ పెట్టానని… వాళ్లు తనపైన ఆధారపడరని… తానే తన కుటుంబంపై ఆధారపడతానని వ్యాఖ్యానించారు. భువనేశ్వరితో హెరిటేజ్ ఇప్పుడు పెద్ద సంస్థగా పెరిగిందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు చాలా మంది చనిపోయారని… వారి కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టానని గుర్తుచేశారు.. ఇక్కడికి 10 వేల బంగారు కుటుంబాలు వచ్చాయన్నారు. ఉగాది … తెలుగు వారి తొలి పండుగ అని తెలిపారు. అందుకే పేదరికం లేని సమాజం కోసం శ్రీకారం చుట్టానని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచిస్తారని… ఆయన స్వార్థం కోసం ఆలోచించరని చెప్పారు. అలాంటి పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.
Also Read : Mother Dairy: ఏపీకు మదర్ డెయిరీ పెట్టుబడులు ! పండ్ల ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటుకు సిద్ధం !