CM Chandrababu: విజయవాడలో జాతీయజెండాను ఆవిష్కరించిన చంద్రబాబు
విజయవాడలో జాతీయజెండాను ఆవిష్కరించిన చంద్రబాబు
CM Chandrababu : విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలందించిన పోలీసు ఉన్నతాధికారులకు సీఎం పతకాలు అందజేశారు.
CM Chandrababu – కాకినాడలో జాతీయ జెండా ఎగురవేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. అంతకుముందు జరిగిన కవాతులో డిప్యూటీ సీఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు. రూ.7,900 కోట్లతో 5 జిల్లాల్లో జల్‌జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని పవన్ చెప్పారు. 2024లో రూ.380 కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. సుస్థిర పాలన కోసమే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలన్న పవన్.. పదవుల్లో ఉండి ఎంజాయ్ చేయాలనేది మా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలపై మాట్లాడిన పవన్.. వైసీపీ వాళ్లు.. గెలిస్తే ప్రజాతీర్పు అంటారు.. కూటమి గెలిస్తే EVMల తప్పా? అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఎద్దేవా చేశారు.
ఉత్తమ సేవలందించిన పోలీసు ఉన్నతాధికారులకు పతకాలు అందజేసిన సీఎం చంద్రబాబు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలందించిన పోలీసు ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) పతకాలు అందజేశారు. పరేడ్ ఆర్మ్‌డ్ విభాగంలో ఏపీఎస్పీ 16వ బెటాలియన్ విశాఖకు మొదటి స్థానం లభించింది. రెండో స్థానంలో ఏపీఎస్పీ కర్నూల్ సెకండ్ బెటాలియన్ నిలిచింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగానికి ప్రోత్సాహక బహుమతిని ప్రదానం చేశారు. అన్ ఆర్మ్‌డ్ విభాగంలో ఏపీ సాంఘిక సంక్షేమ విద్యార్థులు మొదటి స్థానం దక్కించుకుని అవార్డులు పొందారు. రెండోస్థానంలో ఎన్‌సీసీ బాలురకు అవార్డులు ఇచ్చారు. శకటాల ప్రదర్శనలో పట్టు పరిశ్రమ విభాగానికి మొదటి స్థానం లభించింది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ శకటానికి రెండో స్థానం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల శకటానికి మూడో స్థానం లభించింది. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలలకు సీఎం చంద్రబాబు అవార్డులు ప్రదానం చేశారు.
మరోవైపు కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. కత్తిపూడి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాస్‌కు ఉత్తమ సేవలకు పురస్కారం దక్కింది. ఆయన చేసిన సేవలకు గాను పవన్ కల్యాణ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
అభివృద్ధిలో కూటమి ప్రభుత్వానిది ఆల్ టైమ్ రికార్డు – సీఎం చంద్రబాబు
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడారు. ‘‘2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపామన్నారు. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్‌ను నాశనం చేసింది. వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. రూ.10 లక్షల కోట్ల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. ఆ ఐదేళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు. తవ్వినకొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, అక్రమాలు, అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది. అవరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయి.
2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీయే నినాదాన్ని ప్రజలు నమ్మి చరిత్రాత్మక తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్ షేర్‌తో కూటమిని దీవించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేం అధికారాన్ని చేపట్టిన ఏడాదిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా పని చేశాం. తొలి సంతకం నుంచి సుపరిపాలన వైపు అడుగు వేశాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ప్రజల మద్దతు, మా సంకల్పం, దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం. నేను ఈరోజు సవినయంగా, సగర్వంగా చెబుతున్నా కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు.. అభివృద్ధికి అడ్డు లేదు.. సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డు.. ఇదే ఆల్‌టైమ్ రికార్డు అని మరోసారి చెబుతున్నా. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
Also Read : MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
