CM KCR : సీఎం భరోసా వరద బాధితులకు ఆసరా
ప్రకటించిన సీఎం కేసీఆర్
CM KCR : భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేశాయి. ఎస్డీఆర్ఎఫ్ కింద రూ. 900 కోట్లు మూలుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఇదిలా ఉండగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరద బాధితుల కోసం తక్షణ సహాయం కింద రూ. 500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం. దెబ్బ తిన్న రోడ్లకు మరమ్మతులు చేపడతారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
CM KCR Decision
పనిలో పనిగా ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెప్పారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా రవాణాను పటిష్ట పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 43 వేల 373 మంది ఆర్టీసీ సిబ్బంది ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని తెలిపారు. ఇందు కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు. 3న జరిగే శాసనసభలో ఆర్టీసీ ఉద్యోగుల బిల్లు తీసుకు వస్తామన్నారు. హైదరాబాద్ కీలక రూట్లలో మెట్రోను విస్తరించాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు వెల్లడించారు కేటీఆర్(KTR). గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాలలో తిరిగి తీర్మానం చేసి పంపుతామన్నారు.
రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదన్నారు. గవర్నర్ కోటాలో దాసోజు, కుర్రాలకు ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టుకు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కేటీఆర్. హైదరాబాద్ కు మరో ఎయిర్ పోర్ట్ అవసరం ఉందన్నారు. హకీంపేట ఎయిర్ పోర్ట్ ను గోవా తరహాలో పౌర విమానయాన సేవలు ప్రారంభించాలని కోరుతూ కేంద్రానికి విన్నపం. కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయించిందన్నారు కేటీఆర్.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.21 కోట్లు