KCR : నిన్నటి దాకా అంగరంగ వైభవోపేతంగా జరిగిన సహస్రాబ్ది మహోత్సవాలలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్(KCR )ఇవాళ ముచ్చింతల్ లో జరిగే శాంతి కల్యాణంకు వస్తారా అన్నది ఉత్కంఠను రేపుతోంది.
నిన్న శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి మీడియాతో మాట్లాడారు. శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు.
ఇదే సమయంలో తమకు సీఎం కేసీఆర్ (KCR )కు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇదంతా మీడియా కల్పించిన కట్టు కథ అని కొట్టి పారేశారు. మొత్తం కార్యక్రమాలకు అడుగడుగునా సీఎం సహకారం ఉందన్నారు.
అనారోగ్యం, వ్యక్తిగత కారణాల రీత్యా రాలేక పోయారని తెలిపారు. ఇదే సమయంలో ఉత్సవాలలో భాగంగా హాజరైన సీఎం తానే మొదటి సేవకుడినని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
విచిత్రం ఏమిటంటే సీఎంతో పాటు ఆయన కుటుంబీకులు ఎవరూ ఇటు వైపు చూడక పోవడంపై కొంత అసంతృప్తి ఉందన్న ప్రచారం జరిగింది.
ఏది ఏమైనా సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అతిరథ మహారథులు, ప్రముఖులు విచ్చేశారు. రామానుజుడి మార్గాన్ని అనుసరించాలని సూచించారు.
ఇవాళ జరిగే శాంతి కళ్యాణంకు కేసీఆర్ వస్తారని అంతా భావిస్తున్నారు. కానీ ఆయన రేపు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో భేటీ కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అక్కడ చర్చించాల్సిన అంశాలపై మాట్లాడుతున్నట్లు సమాచారం.
మొత్తంగా శాంతి కళ్యాణంకు సారు వస్తారా లేదా అన్నది వేచి చూడాలి.
Also Read : సీఎం కేసీఆర్ తో విభేదాలు లేవు