Chennamaneni Ramesh Babu : ప్రభుత్వ సలహాదారుగా చెన్నమనేని
నియమించిన సీఎం కేసీఆర్
Chennamaneni Ramesh Babu : సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. శనివారం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ , వేముల వాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబును సీఎం కేసీఆర్ నియమించారు.
Chennamaneni Ramesh Babu As a Govt Advisor
ఈ ప్రభుత్వ సలహాదారు పదవి పూర్తిగా కేబినెట్ హోదా కలిగి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. ఆయన 5 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సర్కార్ వెల్లడించింది.
డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబు(Chennamaneni Ramesh Babu) విద్యాధికుడిగా పేరు పొందారు. జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక హంబోల్ట్ యునివర్సిటీ నుంచి ‘అగ్రికల్చర్ ఎకనామిక్స్’లో పరిశోధనలు చేసి పీ.హెచ్.డి పట్టాను పొందారు.
రాష్ట్ర సర్కార్ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే రంగం పట్ల అవగాహన ఉన్న వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వ్యవసాయ శాఖ ను అప్పగించారు. తాజాగా అపారమైన అనుభవం కలిగిన చెన్నమనేనికి ఛాన్స్ ఇచ్చారు.
ఎమ్మెల్యే రమేష్ బాబు పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్ గా వ్యవసాయ రంగం పట్ల అపారమైన అనుభవం ఉంది. ఆయన తన జ్ఞానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయ అభివృద్ది కోసం వినియోగించాలని సీఎం నిర్ణయించారు.
Also Read : Danish Kaneria Slams : బీసీసీఐ తీరుపై కనేరియా కన్నెర్ర