CM KCR Focus : విశాఖ ఉక్కుపై కేసీఆర్ ఫోకస్
బిడ్ లో పాల్గొనాలని నిర్ణయం
CM KCR Focus : బీఆర్ఎస్ పార్టీ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు మీద ఉన్నారు. ఎక్కడా తగ్గడం లేదు. ఎవరికీ తలవంచేది లేదంటూ ప్రకటించారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని , కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
నిరంతరం ఆరోపణలు, విమర్శలతో హోరెత్తిస్తున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశాక దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో సభ కూడా చేపట్టారు. తొలి సభను ఖమ్మంలో చేపట్టారు. అంతే కాదు ఏపీలో కూడా పార్టీకి చీఫ్ ను ఎంపిక చేశారు.
విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రకు తలమానికంగా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఉద్యమించాలని నిర్ణయించారు(CM KCR Focus). దీనిని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తోట చంద్రశేఖర్ ఆత్మీయ సమ్మేళనం చేపట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చారు సీఎం కేసీఆర్. తాజాగా సంచలన ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించారు. పరిశ్రమ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిసైడ్ చేశారు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాధ్యా సాధ్యాలపై అధ్యయనం చేయాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం. ఇదిలా ఉండగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఆహ్వానించింది సంస్థ. ఈ మేరకు మార్చి 27న యాజమాన్యం ప్రకటన రిలీజ్ చేసింది. ఈ నెల 15న డెడ్ లైన్ విధించింది.
Also Read : పలువురు ఎమ్మెల్యేలకు నో ఛాన్స్