KCR : ఇద్ద‌రు సీఎంల భేటీపై ఉత్కంఠ

రేపే ముంబైకి వెళ్ల‌నున్న తెలంగాణ సీఎం

KCR : దేశమంతా త‌న వైపు తిప్పుకునేలా చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రో అడుగు ముందుకేశారు. ఈనెల 20న మ‌రాఠాకు బ‌య‌లు దేరి వెళ‌తారు. అక్క‌డ ఆ రాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో భేటీ అవుతారు.

దేశంలో ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకంగా ఓ ప్ర‌త్యామ్నాయ కూట‌మి ఏర్పాటుపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల సీఎం బీజేపీని, ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేశారు.

జాతీయ స్థాయిలో బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌న్నింటిని ఏక తాటిపై తీసుకు వ‌చ్చే ప‌నిలో కేసీఆర్ (KCR)ఈ మ‌ధ్య ఫోక‌స్ పెట్టారు. ఇందులో భాగంగా సీఎం వెళ్ల‌నున్నారు.

ఇటీవ‌ల సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే సీఎంకు ఫోన్ చేసి ర‌మ్మ‌ని ఆహ్వానించారు. 20న ఉద‌యం 11 గంట‌ల‌కు బేగంపేట విమానాశ్ర‌యం నుంచి స్పెష‌ల్ విమానంలో ముంబైకి వెళతారు.

మ‌ధ్యాహ్నం విందు చేశాక అనంత‌రం జాతీయ స్థాయిలో తాజా రాజ‌కీయాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. ప్ర‌స్తుతం మోడీ అనుస‌రిస్తున్న విధానాలు, రాష్ట్రాల‌కు ఉన్న హ‌క్కుల‌ను కాల రాసే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు కేసీఆర్.

ప‌శ్చిమ బెంగాల్, మ‌రాఠా, త‌మిళ‌నాడు, తెలంగాణ , కేర‌ళ రాష్ట్రాల‌ను ప్ర‌ధానంగా టార్గెట్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు కేసీఆర్(KCR). వీటితో పాటు దేశంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల‌పైనే ఎక్కువ దృష్టి ఉంటుంది.

మోడీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రూపొందించాల్సిన ప్లాన్ పై ఎక్కువ‌గా చ‌ర్చించ‌నున్నారు. దేశ వ్యాప్తంగా రేపు ఇద్ద‌రు సీఎంల భేటీపై ఉత్కంఠ నెల‌కొంది.

ఇదిలా ఉండ‌గా కేసీఆర్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖ నేత‌లు వెళుతున్న‌ట్లు స‌మాచారం.

Also Read : బీజేపీని బొంద పెడ‌తం కాంగ్రెస్ ను తొక్కేస్తం

Leave A Reply

Your Email Id will not be published!