CM KCR Nomination : గజ్వేల్ లో కేసీఆర్ నామినేషన్
రేపే నామినేషన్లకు తుది గడువు
CM KCR Nomination : గజ్వేల్ – తెలంగాణ ఎన్నికలలో భాగంగా పోటీ చేసేందుకు సిద్దమైన సీఎం కేసీఆర్ గురువారం ముహూర్తం బాగా ఉందని నమ్మడంతో గజ్వేల్ లో భారీ అనుచరగణం వెంట రాగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు కేసీఆర్.
CM KCR Nomination in Gajwel
ఇదిలా ఉండగా ఆయా పార్టీల కు సంబంధించి అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేసేందుకు నవంబర్ 10 తుది గడువు విధించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇదిలా ఉండగా గతంలో 2018లో జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు.
కానీ ఈసారి కేసీఆర్(CM KCR) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రెండు చోట్ల బరిలో ఉంటానని ప్రకటించారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గాలలో పోటీ చేయనున్నారు.
ఇవాళ మంచి ముహూర్తం ఉందని పండితులు చెప్పడంతో చాలా మంది అభ్యర్థులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో తుది ఘట్టానికి చేరుకుంది నామినేషన్ల పర్వం. సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు కేటీఆర్. సిద్దిపేటలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఖమ్మంలో పొంగులేటి నామినేషన్ వేశారు.
Also Read : Tejasvi Surya : ట్రబుల్ షూటర్ తో తేజస్వి భేటీ