CM KCR : రాజ శ్యామలా యాగంలో సీఎం బిజీ
ఎర్రవల్లి ఫామ్ హస్ లో కొనసాగుతున్న యాగం
CM KCR : ఎర్రవల్లి – సీఎం కేసీఆర్ కు నమ్మకాలు ఎక్కువ. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న తరుణంలో మరోసారి పవర్ లోకి రావాలని శపథం చేశారు కేసీఆర్(CM KCR). ఆయన ప్రజల కంటే ఎక్కువగా స్వాములను, రిత్వికులను నమ్ముకుంటారు.
CM KCR Viral With Ragasyamala Yagam
గతంలో కూడా పవర్ లోకి రావాలని రాజ శ్యామలా యాగం చేపట్టారు. దీని వల్ల తనకు మంచి చేకూరిందని నమ్మారు. తిరిగి ఈనెల 30న పోలింగ్ జరగనుండడంతో రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని యాగం చేపట్టినట్లు ప్రకటించారు సీఎం.
విశాఖకు చెందిన శ్రీ శారదా పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో రాజ శ్యామలా యాగం కొనసాగుతోంది. భారీ ఎత్తున స్వాములు, రిత్వికులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా స్వాములు కనిపిస్తున్నారు. కాషాయ శోభ కనిపిస్తోంది.
విచిత్రం ఏమిటంటే ఎర్రవల్లిలో యాగం జరుగుతున్నా ఎవరకీ అనుమతి ఇవ్వక పోవడం విచిత్రం. యాగం ఉద్దేశం ప్రజల కోసమైతే ఎవరైనా అనుమతించాల్సి ఉంటుంది. కానీ సారు క్షేత్రంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదు. మొత్తంగా కేసీఆర్ ఏది చేసినా వైరల్ గా మారుతుంది.
Also Read : PM Modi Tour : తెలంగాణలో మోదీ టూర్