CM KCR : హైదరాబాద్ – సీఎం కేసీఆర్ అపర భక్తుడు. ఆయనకు దేవాలయాలంటే గౌరవం. అందుకే యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి ఆలయాన్ని పునర్ నిర్మించారు. నభూతో నభవిష్యత్ అన్న తీరులో తీర్చిదిద్దారు. దీని వెనుక సీఎం కేసీఆర్(CM KCR) ఉన్నారు. భారీ ఎత్తున నిధులను కేటాయించారు.
CM KCR in Rajasuyajam
గతంలో ఎన్నికలు వచ్చే సమయంలో యాగాలు చేయడం సర్వ సాధారణం. తాజాగా ఈనెల 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. ఈసారి ఎవరూ ఊహించని రీతిలో గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సీఎం కేసీఆర్.
ప్రస్తుతం చాలా సర్వేలలో బీఆర్ఎస్ కు ఛాన్స్ లేదని పేర్కొంటుండడం, ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా ఉందని ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా పేర్కొనడంతో సీఎం అప్రమత్తం అయ్యారు. ఎలాగైనా సరే యాగం ద్వారానైనా గట్టెక్కాలని భావిస్తున్నారు.
తాజాగా తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్దిని కాంక్షిస్తూ ఎర్రవల్లి లోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ రాజ శ్యామలా సుబ్రమణ్వేశ్వర యగాన్ని తలపెట్టారు. భారీ ఎత్తున స్వాములు, రుత్వికులు అక్కడికి చేరుకున్నారు.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర , స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోంది.
Also Read : Thailand Visa Free : వీసా లేకుండానే థాయ్‌లాండ్