CM KCR TSPSC : టీఎస్‌పీఎస్సీపై సీఎం స‌మీక్ష

హాజ‌రైన సీఎస్, ఉన్న‌తాధికారులు

CM KCR TSPSC : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్ పీఎస్సీ)పై చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై సీఎం కేసీఆర్(CM KCR TSPSC) శ‌నివారం స‌మీక్ష చేప‌ట్టారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన స‌మావేశంలో మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు , ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి , టీఎస్ పీఎస్సీ చైర్మన్ జ‌నార్ద‌న్ రెడ్డి పాల్గొన్నారు. పేప‌ర్ లీకేజీ , ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ , త‌దుప‌రి కార్యాచర‌ణ‌పై చ‌ర్చించారు.

ఇప్ప‌టికే నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌ను టీఎస్ పీఎస్సీ ర‌ద్దు చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చైర్మ‌న్ జ‌నార్ద‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. గ్రూప్ -1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ, డీఏవో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా గ్రూప్ -1 ప‌రీక్ష‌ను జూన్ 11న తిరిగి నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీల కార‌ణంగా ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.

ఏఈ, టీపీబీవో, వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ ప‌రీక్ష‌ల‌ను కూడా ఇప్ప‌టికే ర‌ద్దు చేసిన విష‌యాన్ని సీఎం(CM KCR TSPSC) కు తెలిపారు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌నార్ద‌న్ రెడ్డి. మ‌రో వైపు జ‌న‌వ‌రి 22న ఏఈఈని , డీఏవోను ఫిబ్ర‌వ‌రి 26న చేప‌ట్టారు. ఇప్ప‌టికే సీడీపీఓ, ఈవో ఫ‌లితాలు వెల్ల‌డించింది. దీనిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. వాటిని కంటిన్యూ చేస్తారా లేక ర‌ద్దు చేస్తారా అన్న‌ది తేలాల్సి ఉంద‌న్నారు.

కేవ‌లం ఇద్ద‌రు వ్య‌క్తుల వ‌ల్ల జ‌రిగిన త‌తంగం త‌ప్ప మ‌రోక‌టి కాద‌న్నారు ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్. ఆయ‌న సీఎం స‌మీక్ష త‌ర్వాత ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. నాలుగు ప‌రీక్ష‌లు ర‌ద్దు అయ్యాయ‌ని, వాటికి సంబంధించిన మెటీరియ‌ల్ ను కూడా ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

Also Read : స్పీక‌ర్ సీరియ‌స్ ఎమ్మెల్యేల సస్పెన్ష‌న్

Leave A Reply

Your Email Id will not be published!