CM KCR Telangana : నా తెలంగాణ అభివృద్దికి నమూనా
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
CM KCR Telangana : తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్(CM KCR Telangana) ప్రసంగించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాలలో ముందంజలో ఉందన్నారు. దేశానికే మన రాష్ట్రం తలమానికంగా మారిందని చెప్పారు. నా తెలంగాణ అభివృద్దికి ఓ నమూనాగా తయారైందని, తనకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోందని స్పష్టం చేశారు సీఎం.
ఒకనాడు కరువు కాటకాలతో, కరెంట్ చావులతో, వలసలతో తల్లడిల్లిందని కానీ ఇవాళ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లో దూరమయ్యాయని పచ్చని పంట పొలాలతో అలరారుతోందన్నారు. ఒక్కప్పుడు నెర్రెలు బారిన పొలాలు దర్శనం ఇచ్చేవని కానీ ఇప్పుడు ఆ పొలాలే రైతులకు మాగాణం పండిస్తున్నాయని చెప్పారు.
ఒకప్పుడు పంజాబ్ ధాన్యాగారంగా ఉండేదని కానీ ఇప్పుడు దేశంలో పంజాబ్ ను దాటేసి తెలంగాణ ధాన్య భాండాగారంగా తయారైందని ఇదంతా రైతుల వల్ల, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సాధ్యమైందని అన్నారు. ఒక నాడు కరెంట్ ఎప్పుడు వస్తదోనని ఎదురు చూసే వాళ్లని, కానీ ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్, సీసీ కెమెరాల ఏర్పాటు చేశామన్నారు. మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక అని పేర్కొన్నారు. గతంలో డీజీపీలుగా పని చేసిన అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి లను ప్రశంసించారు. పారిశ్రామిక రంగంలో కోట్లాది రూపాయలు వచ్చాయన్నారు. ఐటీ పరంగా లక్ష మందికి పైగా జాబ్స్ ఇచ్చిన ఘనత మనదేనని చెప్పారు సీఎం కేసీఆర్(CM KCR).
Also Read : పంటలు కోల్పోయిన రైతులకు దిక్కేది