CM KCR : అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు
ఆదేశించిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్
CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తన జీవిత కాలమంతా ప్రజల కోసమే పాటై బతికిన గద్దర్ ఆగస్టు 6న కన్నుమూశారు. గద్దర్ నక్సలైట్ ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు. ఆ తర్వాత దేశంలోని పలు పోరాటాలకు ఊపిరి పోశాడు. తెలంగాణ రెండో విడత పోరాటానికి తానే ముందున్నాడు. తెలంగాణ ప్రాంతానికి ప్రపంచ వ్యాప్తంగా తన పాటలతో గుర్తింపు తీసుకు వచ్చాడు గద్దర్.
CM KCR Tributes to Gaddar
గద్దర్ సామాజిక నేపథ్యం కలిగిన వ్యక్తి. కవిగా , గాయకుడిగా పేరు పొందారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్(KCR) సంచలన నిర్ణయం ప్రకటించారు. గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాని ఆదేశించారు.
తన జీవిత కాలమంతా ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ అని కొనియాడారు. తెలంగాణ గర్వించదగిన బిడ్డ అని సీఎం అన్నారు. జీవితాంతం వారు చేసిన త్యాగాలు , ప్రజా సేవకు గౌరవ సూచకంగా అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు కేసీఆర్.
Also Read : ATF Gaddar : గద్దర్ పై ఏటీఎఫ్ కామెంట్స్