CM KCR : హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా గులాబీ గెలుపును అడ్డుకోలేరన్నారు. రాష్ట్రంలో నవంబర్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా 119 సీట్లకు సంబంధించి 51 మంది అభ్యర్థులకు బీ ఫారమ్ లు అందజేశారు. ఈ సందర్బంగా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు.
CM KCR Sensational Comments
ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందంజలో కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం దేశానికి తెలంగాణ ఆదర్శ ప్రాయంగా మారిందని స్పష్టం చేశారు.
అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా ప్రయత్నం చేశామని, అందుకే జనం తమను ఆశీర్వదిస్తున్నారని చెప్పారు కేసీఆర్(CM KCR). ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం తాము ఇవ్వడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రైతు బంధును తీసుకు వచ్చామన్నారు.
మహిళలకు ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి ఎమ్మెల్యేలకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు అయి పోయేంత వరకు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు సీఎం కేసీఆర్.
Also Read : Atchannaidu : టీడీపీ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు