CM KCR : కాంట్రాక్టు కార్మికులు పారా హుషార్

క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ ఫైలు పై కేసీఆర్ సంత‌కం

CM KCR : తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. గ‌తంలో ప్ర‌క‌టించిన విధంగానే సీఎం కేసీఆర్ త‌న మాట నిల‌బెట్టుకున్నారు. రాష్ట్రంలో వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌లో కాంట్రాక్టు కింద ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌ను ప‌ర్మినెంట్ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు ఇందుకు సంబంధించిన కీల‌క ఫైలుపై ఆదివారం సంత‌కం చేశారు. నూత‌న సెక్ర‌టేరియేట్ ప్రారంభించారు.

అంత‌కు ముందు యాగ‌శాల‌లో పాల్గొన్నారు. అక్క‌డి నుంచి నేరుగా స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన శిలా ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు. కొత్తగా ప్రారంభించిన స‌చివాల‌యంలో మొత్తం 6 ఫోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6వ అంతస్తు దాకా మంత్రులు, సీఎం, సీఎంఓ , పేషీ, కార్య‌ద‌ర్శుల‌కు కేటాయించారు.

5వ అంత‌స్తుల వ‌ర‌కు మంత్రులకు కేటాయించ‌గా 6వ ఫ్లోర్ లో సీఎం కేసీఆర్ ఆసీనుల‌య్యారు. వేద పండితులు ఆశీర్వాదం అందుకున్నారు. అనంత‌రం త‌న టేబుల్ పై ఏర్పాటు చేసిన 6 ఫైళ్ల‌పై సంత‌కం చేశారు. ఇందులో భాగంగా తొలి సంత‌కం రాష్ట్రంలోని కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేస్తూ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌తో కూడిన ఫైలుపై సిగ్నేచ‌ర్ చేశారు సీఎం కేసీఆర్(CM KCR). దీంతో ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన నిర్ణ‌యంగా దీనిని భావించ‌వ‌చ్చు. కీల‌క అంశాల‌కు సంబంధించిన ఫైళ్ల‌పై సీఎంతో పాటు మంత్రులు కూడా ఆసీనుల‌య్యారు. సంత‌కాలు చేశారు.

Also Read : తెలంగాణ స‌చివాలయం ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!